చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న శ్రీవారి ఆలయం మూసివేత .. ఆ సేవలు కూడా రద్దు

By Siva Kodati  |  First Published Oct 1, 2023, 7:51 PM IST

ఈ నెల 29న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. సహస్ర దీపాలంకరణ సేవ, వయోవృద్ధులు , వికలాంగుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.


ఈ నెల 29న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజున వేకువజామున 1.05 గంటల నుంచి 2.22 వరకు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీంతో 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 28వ తేదీన సహస్ర దీపాలంకరణ సేవ, వయోవృద్ధులు , వికలాంగుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇకపోతే.. శనివారం 87,081 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. మొత్తం 41,757 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించింది. రద్దీ నేపథ్యంలో సర్వదర్శన టోకెన్లను అక్టోబర్ 1, 7, 8, 14, 15 తేదీల్లో నిలిపివేసినట్లు టీటీడీ ప్రకటించింది. 

ALso Read: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

Latest Videos

కాగా.. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు(వీకెండ్, గాంధీ జయంతి) నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని భక్తులతో నిండిపోయి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. మరోవైపు అలిపిరి చెక్‌పాయింట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక, వసతి సౌకర్యాల విషయంలో కూడా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో టీటీడీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది.

click me!