సౌందర్య : ఒక మధుర జ్ఞాపకం

First Published Oct 29, 2016, 2:55 AM IST
Highlights
  • సౌందర్య మరచిపోలేని మధురానుభూతి
  • నటి గానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా తన ముద్ర మిగిలించిన విలక్షణ నాయకి

అప్పటికే తెలుగు సినిమా నాయికలు ’అందాలరాశి’ స్థాయికి చేరారు.

అయితేనేం ఆ సమయంలోనూ తన ప్రత్యేకత నిలుపుకున్న నటి సౌందర్య. అంతఃపురం,పవిత్రబంధం,పెళ్లిచేసుకుందాం,అమ్మోరు,ప్రేమకువేళాయెరా,రాజా తదితర చిత్రాల్లో వ్యక్తిత్వం ఉన్న నాయిక పాత్రలు పోషించింది.కన్నడ,తమిళ చిత్రరంగాల్లోనూ అగ్రశ్రేణి కథానాయికగా వెలుగొందింది. గ్లామర్ పాత్రలు పోషించినా అంగాంగ ప్రదర్శనలు చేయలేదు. 2004 ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.ఆవిడ మరణవార్త విని రోజుల తరబడి నిద్రాహారాలు మాని శొకించిన ప్రేక్షకురాళ్లు ఉన్నారు.

 తెలుగు,కన్నడ నటిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వ పుసస్కారాలు గెలుచుకున్న సౌందర్య మరణానంతరం ఆప్తమిత్ర (తెలుగు,తమిళం లో చంద్రముఖి సినిమా)సినిమా కు ఫిలింఫేర్ అవార్డ్ నూ ఇచ్చారు.

ఇక సౌందర్య నటిగానే కాకుండా ఒక అభిరుచి గల నిర్మాత.

న.డి సౌజ అనే కన్నడ రచయిత ముందుగా ద్వీప కథను రాసి దాన్ని నవలగా విస్తరించాడు.దీని ఆధారంగా ఎన్నో జాతీయ పురస్కారాలు పొందిన గిరీష్ కాసరవళ్లి దర్శకత్వంలో ద్వీప సినిమాను నిర్మించింది.ఒక ప్రాజెక్ట్ వల్ల గ్రామం మునిగిపోతూ ప్రజలు నిర్వాసితులవ్వడం.తరతరాలుగా వున్న భూమితో అనుబంధం తెంచుకోలేక ముంపుగ్రామం లోనే ఉండిపోయే ముసలాయ,తండ్రిమాట జవదాటని కొడుకు.ఆ ముసలాయన కోడలు నాగి పాత్రలో సౌందర్య.వాళ్ల జీవితంలో ప్రవేశించిన ఆధునికతకు ప్రతిరూపం లాంటి నాగి బంధువైన బస్తీ కుర్రాడు,ఒక వరద సమయంలో వారి అంతరంగాలు,నాగి ఆశావహ దృక్పథం చిత్ర కథాంశం.ఈ సినిమాకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల పురస్కారాలు రావటమే కాకుండా ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.

ఇక వంశవృక్షం,పర్వ,దాటు నవలల ద్వారా తెలుగువారికీ సుపరిచితులైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందిన రచయిత భైరప్ప గారి నవల గృహభంగ(తెలుగులో గృహభంగం గా నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ)ఆధారంగా టీవీ ధారావాహికను గిరీష్ కాసరవళ్లి దర్శకత్వంలోనే నిర్మించారు.విమర్శకుల ప్రశంసలనందుకున్న ఈ ధారావాహిక కథా కాలం స్వాతంత్రానికి పూర్వం నాటిది.గయ్యాళి అత్త,చవట భర్తతో వేగుతూ వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న నంజమ్మ అనే ఇల్లాలి కథ ఇది.నాటి గ్రామీణ వాతావరణాన్ని,సమాజాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఈ ధారావాహికలో తాను నటించకుండా నిర్మాతగానే వ్యవహరించింది సౌందర్య. 

  

సౌందర్య అసలు పేరు సౌమ్య.తాను మరణించి పుష్కర కాలం గడిచినా చక్కటి నటిగానే కాకుండా అభిరుచి గల నిర్మాతగా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.

 

click me!