అవనిలో మెరిసిన తెలుగు సింధూరం

First Published Aug 12, 2017, 2:33 PM IST
Highlights
  • ఫుల్ బ్రైట్ నెహ్రూ డాక్టరల్ ఫెలోషిప్ కు ఎంపికయిన తెలుగమ్మాయి లలితా సిందూరి
  • అమెరికాలోని బర్నార్డ్ కాలేజిలో సాంస్కృతిక నృత్యంపై పరిశోదన చేసే అవకాశం

 
 కూచిపూడి నృత్యంలో విశేష ప్రతిభ కనబర్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి విద్యార్థిని యరసూరి లలితా సిందూరి ఫుల్ బ్రైట్ నెహ్రూ డాక్టరల్ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అందించే ఈ ఫెలోషిఫ్ ను ఈ సారి దేశవ్యాప్తంగా 31 మంది ఎంపికయ్యారు. దీని లో బాగంగా 9 నెలలు అమెరికాలోని బర్నార్డ్ కాలేజిలో సాంస్కృతిక నృత్యంపై పరిశోదన చేయనున్నారు. వారిలో తెలుగు తేజం లలితా సిందూరి శాస్రీయ నృత్యం కూచీపూడి విభాగంలో ఎంపికయ్యింది.

 
దేశ వ్యాప్తంగా 800 వందలకు పైగా ప్రదర్శనలిచ్చిన లలిత అనేక అవార్డులను కైవసం చేసుకుంది.  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగ బాలాశ్రీ నేషనల్ అవార్డును అందుకున్నారు. అలాగే బాలరత్న అవార్డును ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. అలాంటి తెలుగుతేజం సింధు నెహ్రూ డాక్టరల్ ఫెలోషిప్ కు ఎంపికై తెలుగువారి పేరును నలుదిశల వ్యాపింపజేసింది.  

 

click me!