చంద్రబాబుతో లగడపాటి మంతనాలు

Published : Sep 12, 2017, 05:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
చంద్రబాబుతో లగడపాటి మంతనాలు

సారాంశం

 ముఖ్యమంత్రితో చంద్రబాబునాయుడితో ముఖ్యమంత్రి సమావేశం కావడం ఇది రెండోసారి. దీనికి చాలా రాజకీయ ప్రాముఖ్యం ఉందంటున్నారు.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి చాలారాజకీయ ప్రాముఖ్యం ఉందని చెబుతున్నారు. చాలా కాలంగా లగడపాటి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోయినా,అపుడపుడు సర్వేలు జరిపి తాను రాజకీయాలకు దూరంగా లేనని చెబుతూ వస్తున్నారు.ఆయన తెలుగుదేశం ా పార్టీలో చేరతారని చాలా రోజులుగా వార్తలు వినబడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టికెట్ ఇస్తే పోటీచేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వెలువడ్దాయి. నంద్యాల ఎన్నికల  సమయంలో ఆయన చేనినట్లుగా చెబుతున్న కొన్ని సర్వేలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఆ పార్టీ యంత్రాంగాన్ని బాగా ఉత్తేజ పరిచాయి. ఈ నేపథ్యంలో   ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ని కలిశారు.  అనంతరం ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి రమ్మన్నారు, అందుకే వచ్చానని  క్లుప్తంగా చెప్పారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు. అలాగే కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల అనంతరం తాను ఎలాంటి సర్వేలు చేయలేదని లగడపాటి తెలిపారు. కాగా గతంలోనూ లగడపాటి  చంద్రబాబుతో సమావేశం అయిన విషయం తెలిసిందే. కాగా చంద్రబాబుతో భేటీపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

అంజనమ్మకు పవన్ కళ్యాణ్ అరుదైన కానుక .. ఏ కొడుకూ తల్లికి ఇలాంటి భర్త్ డే గిఫ్ట్ ఇచ్చుండడు
RK Roja Comments: పవన్ పై రోజా సెటైర్లు | Deputy CM Pawan Kalyan | Asianet News Telugu