టిడిపిలో కూడా దొంగలున్నట్లు ఒప్పుకున్నట్లేనా...

Published : Sep 12, 2017, 03:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
టిడిపిలో కూడా దొంగలున్నట్లు ఒప్పుకున్నట్లేనా...

సారాంశం

‘‘వైసీపీ తాత్కాలిక పార్టీ, అందులో ఉండేవారంతా రౌడీలు, జేబుదొంగలే’’,,,ఇది చంద్రబాబునాయుడు సోమవారం చేసిన వ్యాఖ్యలు. సరే, నిప్పు  చంద్రబాబు మాటలే కాసేపు నిజమే అనుకుందాం. మరి, అదే వైసీపీలోని 21 మంది ఎంఎల్ఏలను ప్రలోబాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్నదెవరు? చంద్రబాబే కదా?

‘‘వైసీపీ తాత్కాలిక పార్టీ, అందులో ఉండేవారంతా రౌడీలు, జేబుదొంగలే’’,,,ఇది చంద్రబాబునాయుడు సోమవారం చేసిన వ్యాఖ్యలు. పాలకొండ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశంపార్టీ కార్యక్రమాన్ని ప్రాంరభిచారు. అప్పుడు జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు. ఇక్కడే అందరికీ ఓ సందేహం వస్తోంది. వైసీపీ ఉండేవారంతా రౌడీలు, జేబుదొంగలే. సరే, నిప్పు  చంద్రబాబు మాటలే కాసేపు నిజమే అనుకుందాం.

మరి, అదే వైసీపీలోని 21 మంది ఎంఎల్ఏలను ప్రలోబాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్నదెవరు? చంద్రబాబే కదా? అంటే వాళ్ళు జేబుదొంగలు, రౌడీలని తెలిసే కదా లాక్కున్నారు. పైగా వారిలో నలుగురికి మంత్రిపదవులు కుడా కట్టబెట్టారు కదా?  నంద్యాల, కాకినాడలో గెలుపు తర్వా మళ్ళీ మరి కొందరికి గాలమేస్తున్నారని ప్రచారం జరుగుతోంది కదా? రౌడీలకు, జేబుదొంగలకు ఎందుకు గాలమేస్తున్నట్లు? వైసీపీలో ఉన్నపుడు దొంగలు, టిడిపిలోకి మారగానే దొరలైపోతారా? దొంగలెక్కడున్నా దొంగలే కదా? ఏదో ఆవేశంలో నోరు జారినా టిడిపిలో కుడా రౌడీలు, జేబుదొంగలున్నట్లు చంద్రబాబు అంగీకరించినట్లే కదా

PREV
click me!

Recommended Stories

విశాఖలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Visakhapatnam Tour| Asianet News Telugu
పసిఫిక్ మహాసముద్రంలో తుపాను...ఏపీ, తెలంగాణలో వర్షాలు | AP & Telangana Weather | Asianet News Telugu