నిధులు నిలువ ఉండదని జీవీఎల్‌కు తెలియదా..? వార్డ్ మెంబర్‌గా గెలవగలరా..?

First Published 5, Aug 2018, 4:52 PM IST
Highlights

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై జీవీఎల్ చేసిన ఆరోపణలని అవాస్తవాలని.. పీడీ అకౌంట్‌లో రూ.20 వేల కోట్లు మురిగిపోతున్నాయంటూ నరసింహారావు తెలిసి తెలియక మాట్లాడుతున్నారని ఆరోపించారు..

నిధులే ఉంటే రాష్ట్రం ఎందుకు అప్పులు చేస్తుందని కుటుంబరావు ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్‌కు.. ట్రెజరీలో నిధులు నిలువ ఉండదనే విషయం కూడా తెలియదా అని కుటుంబరావు వ్యాఖ్యానించారు.. కేంద్రంలో చాలా శాఖలు కూడా యూసీలు ఇవ్వలేదని కాగ్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఆయన కనీసం ఏపీలో వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేరని సవాల్ చేశారు.

Last Updated 5, Aug 2018, 4:52 PM IST