కర్నూలు రోడ్డు ప్రమాదం: కొద్దిసేపట్లో ఇంటికి చేరేవారే, మృతులు వీరే

By telugu teamFirst Published May 11, 2019, 9:53 PM IST
Highlights

అనంతపురం జిల్లా గుంతకల్లులో వివాహ నిశ్చితార్ధ వేడుకను ముగించుకొని సాయంత్రం వేళ బయలుదేరారు. వాళ్లంతా కాసేపట్లో కర్నూలులోకి ప్రవేశించి మరో రెండు గంటల్లో సొంత ఊరికి చేరుకునేవారే. కానీ ఇంతలోనే బస్సు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది.

కర్నూలు:  కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించనవారిలో 14 మంది తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రామపురానికి చెందినవారు. వారితో పాటు బైక్ పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మరణించాడు.

అనంతపురం జిల్లా గుంతకల్లులో వివాహ నిశ్చితార్ధ వేడుకను ముగించుకొని సాయంత్రం వేళ బయలుదేరారు. వాళ్లంతా కాసేపట్లో కర్నూలులోకి ప్రవేశించి మరో రెండు గంటల్లో సొంత ఊరికి చేరుకునేవారే. కానీ ఇంతలోనే బస్సు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది.

హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు వేగంగా వెళ్తూ వెల్దురి సమీపంలోని ఓ మలుపు వద్దకు చేరుకుంది. అకస్మాత్తుగా బైక్ ఎదురుపడింది. బైక్ ను తప్పించే ప్రయత్నంలో బస్సు డ్రైవర్‌ వాహనాన్ని పక్కకు తిప్పాడు. రెప్పపాటు కాలంలో అది డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢీ కొట్టింది. 

బైక్ ను ఢీకొట్టి తుఫాను వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, తుఫాన్ వాహనంలోని 15 మందిలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  

మృతుల్లో వెంకట్రాముడు (30), గోపీనాథ్ (25), రాముడు (45) మునిస్వామి(30), భాస్కర్(30), సోమన్న(40), తిక్కన(40), సాలన్న(30), నాగరాజు(25),  పరుశు రాముడు(28), సురేష్(30), విజయ్(35),  పగులన్న(45), చింతలన్న(55) ఉన్నారు. బైక్ ప్రయాణికుడు వెల్దుర్తికి చెందిన మాసుం (35) కూడా మృతుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

కర్నూలు రోడ్డు ప్రమాదం: పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ 15 మందిలో ఒక్కరే మిగిలారు

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం (ఫోటోలు)

కర్నూలులో రోడ్డు ప్రమాద బీభత్సం (వీడియో)

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది మృతి

click me!