ఆఫ్టర్ రిజల్ట్స్: పవన్ దారేటు.. తమ్ముణ్ణి కెలకొద్దంటున్న నాగబాబు

Siva Kodati |  
Published : May 11, 2019, 08:28 PM IST
ఆఫ్టర్ రిజల్ట్స్: పవన్ దారేటు.. తమ్ముణ్ణి కెలకొద్దంటున్న నాగబాబు

సారాంశం

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి సినిమాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సోదరుడు నాగబాబు ఘాటుగా స్పందించారు

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి సినిమాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సోదరుడు నాగబాబు ఘాటుగా స్పందించారు.

పవన్ మళ్లీ సినిమాలు చేస్తారా..? చేయరా.. రాజకీయాల్లోనే కొనసాగుతారా అనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. పవన్‌ను కొంతమంది కించపరుస్తున్నారని నాగబాబు మండిపడ్డారు. అయితే పవన్ కల్యాణ్ జోలికి వెళ్లకుండా మంచిదని, ఎవరైనా డీగ్రేడ్ చేస్తే 100 రెట్లు పైకి లేస్తారని హెచ్చరించారు.

పవన్‌ను విమర్శిస్తే అది ఆయనకే ప్లస్ అవుతుందని తప్పించి వేరొకటి కాదని నాగబాబు తెలిపారు. ఎన్టీఆర్, జమున, చిరంజీవి లాంటి వాళ్లు రాజకీయ ప్రవేశం తర్వాత కూడా సినిమాలు చేశారని.. అయితే పవన్ అలానే చేయాలనే రూల్ లేదు కదా..? అని నాగబాబు ప్రశ్నించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం