హిందూపురంలో బాలకృష్ణపై మహిళను పోటీకి దింపుతున్న వైసీపీ..

By SumaBala BukkaFirst Published Jan 10, 2024, 3:57 PM IST
Highlights

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మకాం వేశారు. హిందూపురం నుంచి పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు. వైసీపీ అభ్యర్థులను  గెలిపించుకునే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. 

హిందూపురం : తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న హిందూపురంపై వైసీపీ గట్టిగా ఫోకస్ పెట్టింది. రెండుసార్లు హిందూపురం నుంచి గెలిచినా  తెలుగుదేశం అక్కడ ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయిందని మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి అన్నారు. ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైసీపీకి గెలిపించాలని.. అభివృద్ధి చేయించుకోవాలని అన్నారు.  హిందూపురం కంటే బాలకృష్ణపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తున్నా.. అభివృద్ధి మంత్రంతో,  ఓ కురుబ సామాజిక వర్గానికి చెందిన మహిళను బరిలోకి దింపుతూ.. ఊహించని దెబ్బ కొట్టడానికి రెడీ అయిపోయింది వైసీపీ.

దీంట్లో భాగంగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మకాం వేశారు. హిందూపురం నుంచి పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు. వైసీపీ అభ్యర్థులను  గెలిపించుకునే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారంటూ తెలిపారు.  హిందూపురం అసెంబ్లీ బరిలో కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికను,  పార్లమెంటుకు బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన శాంతిని బరిలోకి దింపుతున్నారు. 

Latest Videos

అంబటిరాయుడు వైసీపీ నుంచి జనసేనలోకి ఎందుకు వెళ్లారంటే...

ఇలా వెనకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకే చోటు నుంచి అవకాశం ఇవ్వడం గతంలో ఏ పార్టీ చేయలేదని పెద్దిరెడ్డి తెలిపారు. బాలకృష్ణపై కురవ సామాజిక వర్గానికి చెందిన దీపికను పోటీకి దింపి.. బాలకృష్ణకు గట్టి చెక్కు పెట్టాలని నిర్ణయించారు.  ఈ క్రమంలోనే వైసీపీలో టికెట్లు కేటాయింపులో వెలువెత్తుతున్న అసంతృప్తిని త్వరలోనే అధిగమిస్తామన్నారు పెద్దిరెడ్డి. ఇక హిందూపురం నుంచి టీడీపీ జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదంటూ ఎద్దేవా చేశారు.

జనసేనలో అయితే పవన్ కళ్యాణ్ తప్ప పోటీ చేసేవారు ఎవరున్నారంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ ఉనికి లేదన్నారు… ఓట్లు చీల్చడం కోసం చంద్రబాబు చేస్తున్న కుట్ర అని తెలిపారు. 

click me!