
కాపు ఉద్యమ నేత ముద్రగడ పోలీసుల నిరసనగా చేవిలో పూలు పెట్టుకున్నారు. ఆయన పాదయాత్రకు పోలీసులు మరోసారి బ్రేక్ వేశారు. ముద్రగడ పద్మనాభంను పోలీసులు శనివారం తన ఇంటి వద్ద అడ్డుకున్నారు. పోలీసులకు, కాపు నేతలకు మధ్య కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరికి ముద్రగడ 24 గంటల్లోగా ఉన్నతాధికారులతో మాట్లాడి పాదయాత్రకు అనుమతించాలని డిమాండ్ చేశారు. లేదంటే అరెస్టు చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు బాబు సర్కారు కావాలనే కాపులను ఉద్యమాన్ని నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే తనని అరెస్ట్ చేసి జైలు పంపించాలని డిమాండ్, అరెస్ట్ చేసిన తరువాత తాను కోర్టుకు వెళ్లనని, స్టేలు, బెయిల్ తెచ్చుకోబోనని తేల్చిచెప్పారు. పోలీసుల తీరును నిరసిస్తూ ముద్రగడ సహా కాపు నేతలంతా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.