ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోలీసు కేసు నమోదు.. కారణమిదే..!

By Sumanth KanukulaFirst Published Jan 28, 2023, 4:40 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోలీసు కేసు నమోదైంది. అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 

తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోలీసు కేసు నమోదైంది. అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శుక్రవారం రోజున యువ గళం పేరుతో పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడుతో పాటు  పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అయితే కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎస్సై శివకుమార్ కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో కుప్పం పోలీసులు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు. అచ్చెన్నాయుడిపై 153 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా రాజకీయ నాయకులు మాట్లాడటం సరికాదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

click me!