అది ప్రభుత్వం జారీ చేసిన జీవో కాదు.. ప్రజలు నమ్మొద్దు: ఏపీ ఆర్థిక శాఖ క్లారిటీ

Published : Jan 28, 2023, 03:51 PM IST
అది ప్రభుత్వం జారీ చేసిన జీవో కాదు.. ప్రజలు నమ్మొద్దు: ఏపీ ఆర్థిక శాఖ క్లారిటీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు‌ను పెంచిందనే వార్త వైరల్ అయింది. ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 నుంచి 65కు పెంచుతున్నట్టుగా ఆర్థిక శాఖ జీవో జారీచేసినట్టుగా ఓ పీడీఎఫ్ కాపీ ప్రచారంలోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు‌ను పెంచిందనే వార్త వైరల్ అయింది. ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 నుంచి 65కు పెంచుతున్నట్టుగా ఆర్థిక శాఖ జీవో జారీచేసినట్టుగా ఓ పీడీఎఫ్ కాపీ ప్రచారంలోకి వచ్చింది. అయితే దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఆ వార్తలను ఖండించింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ పెంపునకు సంబంధించి ఎలాంటి జీవో జారీ చేయలేదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని పెంచిందని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కాపీ.. నకిలీ జీవో అని స్పష్టం చేసింది. 

జీవో నకిలీదని, కల్పితమని.. ప్రభుత్వం జారీ చేసినది కాదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఫేక్ జీవో ద్వారా ఉద్యోగులు,  ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఇటువంటి  చర్యలకు పాల్పడినవారిపై చట్ట ప్రకారం నేరస్థులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ క్రమంలోనే ఫేక్ జీవోపై ఆర్థిక శాఖ అధికారులు గుంటూరు డీఐజీకి ఫిర్యాదు చేశారు. 

 

‘‘జీవో (జీవో ఎం ఎస్ నెంబర్ 15 ఆంధ్రప్రదేశ్ పేరుతో పీడీఎఫ్ ఫైల్) ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచబడిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా అటువంటి జీవో జారీ చేయలేదు’’ అని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్టులో కూడా ప్రభుత్వం పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!