రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం.. 16లోగా ఎన్జీటికి నివేదిక

By Siva KodatiFirst Published Aug 11, 2021, 7:51 PM IST
Highlights

పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌, రాయలసీమ ఎత్తిపోతలను బుధవారం కేఆర్ఎంబీ బృందం పరిశీలించింది. ఎన్జీటికి 16వ తేదీలోగా నివేదిక సమర్పిస్తామని కేఆర్ఎంబీ కన్వీనర్ రాయపురే చెప్పారు. ఎత్తిపోతల పనుల పరిశీలనపై కోర్టుకు నివేదిస్తామని కన్వీనర్ వెల్లడించారు
 

ఆంధ్రప్రదేశ్-తెలంగాణల  మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా వున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌ను కేఆర్ఎంబీ బృందం  బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పనులను కేఆర్ఎంబీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కేఆర్ఎంబీ కన్వీనర్ రాయపురే మాట్లాడుతూ... రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించామన్నారు. ఎన్జీటికి 16వ తేదీలోగా నివేదిక సమర్పిస్తామని రాయపురే చెప్పారు.

Also Read:రాయలసీమపై నివేదికను సమర్పించలేం.. 3 వారాలు గడువు ఇవ్వండి: ఎన్జీటీకి కేఆర్ఎంబీ లేఖ

ఎత్తిపోతల పనుల పరిశీలనపై కోర్టుకు నివేదిస్తామని కన్వీనర్ వెల్లడించారు. కేఆర్ఎంబీ ఆదేశాలతోనే పనులు పరిశీలించామని రాయపురే అన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్‌పై కేఆర్ఎంబీకి వివరించామన్నారు పీఈ మురళీధర్. అలాగే మచ్చుమర్రి లిఫ్ట్‌ను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ ఎందుకు మార్చామో వివరించామని చెప్పారు. సర్వే పనులు చేస్తున్నామని.. ప్రాజెక్ట్ పనులు ప్రారంభించలేదని మురళీధర్ వెల్లడించారు. సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పించామని.. పర్యావరణ అనుమతుల కోసం ఎన్జీటికి పంపామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని మురళీధర్ పేర్కొన్నారు. 
 

click me!