జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. అంగీకారమే: రాజధాని ప్రాంత వైసీపీ నేతలు

By Siva KodatiFirst Published Dec 26, 2019, 6:39 PM IST
Highlights

రాజధాని ప్రాంత వైసీపీ నేతలతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశం ముగిసింది.

రాజధాని ప్రాంత వైసీపీ నేతలతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా తామంతా శిరసా వహిస్తామని వారు ముక్త కంఠంతో స్పష్టం చేశారు.

అనంతరం మాజీ మంత్రి, వైసీపీ నేత పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులు సంతోషంగా ఉండేలా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాజధాని అంటే కొత్త పట్టణాల నిర్మాణం కాదన్నారు.

Also Read:ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్: జగన్‌తో రాజధాని ప్రాంత వైసీపీ నేతల భేటీ

చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక సెటప్‌ కోసం రూ.5,800 కోట్లు ఖర్చు చేశారని.. అది పూర్తి చేయాలంటే లక్ష కోట్లు అవసరమవుతాయన్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఒకే ప్రాంత అభివృద్ధి కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టగలిగే స్థితిలో ప్రభుత్వం లేదని అంబటి స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్షతో వ్యవహరించడం లేదని ఆయన వెల్లడించారు. రాజధాని అంటే సెక్రటేరియేట్, అసెంబ్లీ, హైకోర్టు అని అవి ఏర్పడిన ప్రాంతాల్లో అభివృద్ధి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాజధాని తరలిస్తున్నామని చెప్పకముందే ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఆహ్వానించారని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, చంద్రబాబు చేసిన అప్పుల వల్లే మూడు రాజధానుల నిర్ణయం చేయవలసి వచ్చిందని మల్లాది స్పష్టం చేశారు.

Also Read:నా పేరుతో అధికారులపై ఒత్తిడి చేస్తే క్రిమినల్ కేసులు: విజయసాయిరెడ్డి

రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని.. అవసరమైతే వారితో చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని మల్లాది మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం మొదలుపెట్టారని ఆయన దుయ్యబట్టారు.
 

click me!