ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్: జగన్‌తో రాజధాని ప్రాంత వైసీపీ నేతల భేటీ

By Siva KodatiFirst Published Dec 26, 2019, 5:25 PM IST
Highlights

మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వస్తుండటంతో పాటు శుక్రవారం కేబినెట్ భేటీ ఉండటంతో రాజధాని ప్రాంతంలో రాజకీయాలు వేడెక్కాయి.

మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వస్తుండటంతో పాటు శుక్రవారం కేబినెట్ భేటీ ఉండటంతో రాజధాని ప్రాంతంలో రాజకీయాలు వేడెక్కాయి.

ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు జగన్ వివరిస్తున్నారు.

రైతుల ఆందోళనలు, అమరావతిలో చేపట్టనున్న కార్యక్రమాలపై సీఎం చర్చిస్తున్నారు. అలాగే రైతులకు భరోసా కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎలా వారికి నచ్చజెప్పాలనే దానిపై నేతలు మంతనాలు జరుపుతున్నారు. రేపు కేబినెట్ సమావేశం ఉండటంతో ముందస్తుగా రెండు జిల్లాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

Also Read:విశాఖకు జైకొట్టిన శ్రీ భరత్: బాలకృష్ణ కుటుంబంలో చిచ్చురేపిన జగన్...?

ఈ భేటీలో హోంమంత్రి సుచరిత,  మోపిదేవి, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా,  తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు,  సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి , విజయవాడ ఎమ్మెల్యే మలాది విష్టు, పార్థసారథి, దేవినేని అవినాష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

మరోవైపు రేపటి కేబినెట్ సమావేశానికి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం పోలీస్ శాఖను ఆదేశించింది. తొలుత సచివాలయంలోనే మంత్రివర్గ భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ.. రాజధాని ప్రాంత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుండటంతో వేదికను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read:మూడు రాజధానుల చిచ్చు:టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రహమాన్ రాజీనామా

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం ఉండే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. ఈ భేటీలో జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించి.. దానిని ఆమోదించనున్నారు. 

click me!