ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కోయంబేడు మార్కెట్ ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 44 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి తెర పడడం లేదు. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 44 కేసులు నమోదయ్యాయి. వీటిలో 14 కేసులు కోయంబెడు మార్కెట్ తో లింకులున్నవే కావడం విశేషం.
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,671కి చేరుకుంది. ఇప్పటి వరకు 1848 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మరో 767 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 56 మంది కరోనా వైరస్ తో మరణించారు.
undefined
: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM):
*10,240 సాంపిల్స్ ని పరీక్షించగా 44* మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*41 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు
విదేశాల నుంచి వచ్చినవారిలో 62 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అందులో 45 కొత్త కేసులు. వారిలో 41 మంది కువైట్ నుంచి, ముగ్గురు ఖతర్ నుంచి, ఒకరు సౌదీ అరేబియా నుంచి వచ్చినవారు.
Cumulative positive cases from Foreign Returnees 62. (45 New Cases today (41 from Kuwait, 3 from Qatar and 1 from Saudi Arabia).
— ArogyaAndhra (@ArogyaAndhra)ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 153 మందికి కరోనా వైరస్ వ్యాధి సంక్రమించింది. వారిలో ఒడిశాకు చెందిన 10 మంది, మహారాష్ట్ర నుంచి వచ్ిచన 101 మంది, గుజరాత్ నుంచి 26 మంది, కర్ణాటక నుంచి వచ్చిన ఒకరు ఉన్నారు. తమిళనాడు వచ్ిచన ముగ్గురు, రాజస్థాన్ నుంచి ఒక్కరు, రాజస్థాన్ నుంచి ఒకరు ఉన్నారు. మొత్తం యాక్టివ్ కేసులు 117 ఉండగా, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు డిశ్చార్జీ అయ్యారు.
Cumulative positive cases from other states:153. (Odisha: 10, Maharastra: 101, Gujarat: 26, Karnataka: 1, West Bengal: 1, Rajasthan:11, Tamilnadu:3 ) Active cases: 117 ( 2 Discharges from Maharastra)
— ArogyaAndhra (@ArogyaAndhra)