విమాన ప్రయాణీకులకు ఏపీ సర్కార్ గైడ్‌లైన్స్ ఇవీ....

By narsimha lode  |  First Published May 25, 2020, 10:57 AM IST

 దేశీయ విమానాల్లో రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణీకులకు ఏపీ ప్రభుత్వం పలు నిబంధనలను పెట్టింది. ఇవాళ్టి నుండి డొమెస్టిక్ విమానాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.



అమరావతి: దేశీయ విమానాల్లో రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణీకులకు ఏపీ ప్రభుత్వం పలు నిబంధనలను పెట్టింది. ఇవాళ్టి నుండి డొమెస్టిక్ విమానాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. విమాన ప్రయాణీకులకు కేంద్ర విమానాయాన శాఖ కూడ గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ గైడ్ లైన్స్ కు తోడుగా ఏపీ ప్రభుత్వం మరికొన్ని మార్గదర్శనాలను జోడించి అమలు చేస్తోంది.

విమానాల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రయాణీకులు ముందుగా స్పందన వెబ్‌సైట్ లో తమ విమరాలు నమోదు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పందన వెబ్ సైట్ నుండి ప్రభుత్వం అనుమతి పొందిన తర్వాతే విమాన సంస్థలు టిక్కెట్లను బుక్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Latest Videos

ఏపీకి చేరుకొన్న తర్వాత కరోనా లక్షణాలుంటే వారం రోజులు ప్రభుత్వ క్వారంటైన్ లో మరో వారం హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేయాలన్నారు. ఎక్కువ కేసులు నమోదయ్యే రాష్ట్రాల నుండి వచ్చే వారికి  కరోనా లక్షనాలు లేకపోయినా క్వారంటైన్ తప్పనిసరి చేసింది ఏపీ సర్కార్.

also read:కోయంబేడు, విదేశీ లింకులు: ఏపీపై కరోనా దెబ్బ, మొత్తం 2627కి చేరిన కేసులు

తక్కువ కేసులు నమోదయ్యే ప్రాంతాల నుండి వచ్చే వారికి హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కోయంబేడు మార్కెట్ లింకులతో రాష్ట్రంలో ఇటీవల ఎక్కువ కేసులు నమోదౌతున్నాయి.

also read:దేశీయ ప్రయాణాలకు అనుమతులు: కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్‌లైన్స్ ఇవీ...

రాష్ట్రంలో  పరీక్షలను కూడ ఎక్కువగా చేస్తున్నందున కేసులు కూడ ఎక్కువగా నమోదౌతున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఆదివారం నాటికి రాష్ట్రంలో 2627 కరోనా కేసులు నమోదయ్యాయి.విదేశాల నుండి వచ్చినవారికి కూడ కరోనా కేసులు నమోదైనట్టుగా ఆదివారం నాడు  విడుదల చేసిన కరోనా బులెటిన్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

click me!