హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి.. నాగబాబు మరో ట్వీట్

Published : May 25, 2020, 10:52 AM IST
హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి.. నాగబాబు మరో ట్వీట్

సారాంశం

మొన్నటికి మొన్న గాడ్సే గురించి, ఆ తర్వాత గాంధీ గురించి ట్వీట్స్ చేసిన ఆయన తాజాగా.. హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి అంటూ ట్వీట్ చేశారు.

మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు.. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. వివాదాస్పద అంశాలను తీసుకొని మరీ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. మొన్నటికి మొన్న గాడ్సే గురించి, ఆ తర్వాత గాంధీ గురించి ట్వీట్స్ చేసిన ఆయన తాజాగా.. హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి అంటూ ట్వీట్ చేశారు.

తాజాగా టీటీడీ ఆస్థుల‌ను అమ్మాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ‘‘తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్థులని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది. అంతే కాని స్వామివారి భూములను అమ్మే హక్కు మీకు లేదు..హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి.నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను’’ అంటూ నాగబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

కాగా.. ఇటీవల ‘‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

అంతకముందు.."ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable.కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు" అని నాగబాబు అన్నారు

."కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్" అని అన్నారు.

నాథూరామ్ గాడ్సే జన్మదినం సందర్భంగా నాగబాబు ఆ ట్వీట్ చేశారు.  ఆ ట్వీట్ పై కాంగ్రెస్ నేతలు విపరీతంగా మండిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu