వైసీపీకి షాక్.. ఈ రోజు టీడీపీలో చేరనున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..

Published : Mar 24, 2023, 09:30 AM ISTUpdated : Mar 24, 2023, 09:31 AM IST
వైసీపీకి షాక్..  ఈ రోజు టీడీపీలో చేరనున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..

సారాంశం

వైసీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన, మరికొంతమంది నేతలతో టీడీపీలోకి చేరనున్నారు. 

నెల్లూరు : ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ, టిడిపిల మధ్య పోరు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మరింత రసవత్తరంగా మారింది. వైసీపీ తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఇప్పుడు వార్తల్లో  నిలిచారు. శుక్రవారం ఆయన టిడిపిలో చేరనున్నారు. తాను టిడిపిలో చేరుతున్నానని.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయానికి వచ్చానని గిరిధర్ రెడ్డి తెలిపారు.  అంతేకాదు ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున తరలు వచ్చి ఆశీర్వదించి, మద్దతు తెలపాలని కోరారు. ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను నగరం మొత్తం ఏర్పాటు చేశారు. 

శుక్రవారం ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహిస్తారు.  ఆ తర్వాత తాడేపల్లికి తరలివెళ్లి టిడిపిలో చేరేలా ఏర్పాట్లు చేశారు.  చంద్రబాబు సమక్షంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత.. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు.. టిడిపి కండువాలు కప్పుకోనున్నట్లుగా సమాచారం. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టిడిపిలో చేరే కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేశారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు  తెలుస్తోంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గిరిధర్ రెడ్డి పని చేశారు. గత కొంతకాలంగా  సోదరుడు, వైసీపీ తిరుగుబాటు నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు పార్టీకి దూరంగా ఉంటున్నారు. 

వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి దక్కేది 5 స్థానాలే.. జగన్ గెలుస్తాడో లేదో.. పులివెందుల దక్కుతుందో లేదో.. : రఘురామ

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?