ప్రలోభాలతో గెలిచింది గెలుపా .. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరో తేలుస్తాం : సజ్జల రామకృష్ణారెడ్డి

Siva Kodati |  
Published : Mar 23, 2023, 09:31 PM IST
ప్రలోభాలతో గెలిచింది గెలుపా .. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరో తేలుస్తాం : సజ్జల రామకృష్ణారెడ్డి

సారాంశం

వైసీపీకి వున్న బలం ప్రకారం.. ఏడు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీకి దక్కాలని, కానీ రాలేదంటే తమలో ఎవరినో చంద్రబాబు ప్రలోభాలకు గురిచేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రలోభాలకు గురై క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరన్న దానిపై తమకు తెలియదని.. దీనిపై ఆరా తీస్తున్నట్లు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.   

ఎత్తులు, జిత్తుల్లో చంద్రబాబు ఆరి తేరారని అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ విజయంపై ఆయన స్పందించారు. గురువారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో ఎంటరైన నాటి నుంచి రాజకీయ వ్యూహాల్లో వున్నారే కానీ, ప్రజలను పట్టించుకోలేదని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వైసీపీకి వున్న బలం ప్రకారం.. ఏడు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీకి దక్కాలని, కానీ రాలేదంటే తమలో ఎవరినో చంద్రబాబు ప్రలోభాలకు గురిచేశారని సజ్జల ఆరోపించారు. ప్రలోభాలకు గురైన వారి ఫ్యూచర్ ఏమవుతుందో తనకు తెలియదన్నారు. ఈయన హిస్టరీ వాడుకుని వదిలేసే రకమని, దీనినే చూసి బలం పెరిగింది అనుకుంటే కష్టమన్నారు. 

ఆయన పిచ్చి ఆయనకు ఆనందమంటూ సజ్జల సెటైర్లు వేశారు. ప్రలోభాలకు గురై క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరన్న దానిపై తమకు తెలియదని.. దీనిపై ఆరా తీస్తున్నట్లు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తన నేర్పరితనం చూపించారని, టీడీపీ పోటీ పెట్టాక తమ ప్రయత్నం తాము చేశామని సజ్జల స్పష్టం చేశారు. మా ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే క్రాస్ ఓటింగ్ జరిగిందని సజ్జల పేర్కొన్నారు. తెరవెనుక డబ్బులు పనిచేశాయని అనుకోవాలని.. క్రాస్ ఓటింగ్ జరగకుండా మానవ ప్రయత్నం చేశామని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. క్రాస్ ఓటింగ్‌పై పార్టీ అంతర్గతంగా చర్చిస్తుందని సజ్జల స్పష్టం చేశారు. ప్రలోభ పెట్టి గెలవడాన్ని సక్సెస్ అనుకోకూడదని ఆయన చురకలంటించారు. 
 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu