ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎన్నిక

By narsimha lodeFirst Published Jun 18, 2019, 12:44 PM IST
Highlights

 ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో  ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

అమరావతి: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో  ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం నాడు అసెంబ్లీలో అధికారికంగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సోమవారం నాడు నోటిఫికేషన్  విడుదలైంది. ఏపీ డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ పదవిని  బ్రహ్మణ సామాజిక వర్గానికి కేటాయించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఈ పదవికి బాపట్ల నుండి ఎన్నికైన కోన రఘుపతిని ఎంపిక చేశారు.

సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ పదవికి  కోన రఘుపతి నామినేషన్ దాఖలు చేశారు. రఘుపతికి మద్దతుగా సుమారు 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ నామినేషన్లు వేశారు. రఘుపతి మినహా వేరే నామినేషన్లు దాఖలు కాకపోవడంతో డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి ఎన్నికైనట్టుగా మంగళవారం నాడు అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోన రఘుపతిని  ఏపీ సీఎం వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబునాయుడులు దగ్గరుండి సబాపతి స్థానం వద్దకు తీసుకెళ్లి ఆ స్థానంలో కూర్చొబెట్టారు.డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోన రఘుపతిని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు అభినందించారు.

సంబంధిత వార్తలు

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి నామినేషన్ దాఖలు

 

click me!