ఎదురుపడ్డ జేసీ, యనమల: టీడీపీ ఓటమిపై పరస్పర నిందలు

Published : Jun 18, 2019, 11:35 AM ISTUpdated : Jun 18, 2019, 11:39 AM IST
ఎదురుపడ్డ జేసీ, యనమల:  టీడీపీ ఓటమిపై పరస్పర నిందలు

సారాంశం

మాజీ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, యనమల రామకృష్ణుడుల మధ్య మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.  

అమరావతి: మాజీ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, యనమల రామకృష్ణుడుల మధ్య మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.

మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు ఎదురుపడ్డారు.

ఈ సమయంలో  ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.   రాయలసీమపై కోపం తగ్గిందా అంటూ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును ఉద్దేశించి మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు.

మీ వల్లే నష్టం జరిగిందని  మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు  జేసీ దివాకర్ రెడ్డికి కౌంటరిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 23 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైంది. వైసీపీకి 151 స్థానాలు దక్కాయి.

సంబంధిత వార్తలు

బీజేపీ నుండి ఆహ్వానం: ఏమీ తేల్చని జేసీ దివాకర్ రెడ్డి

చంద్రబాబు మారాల్సిందే, జగన్ అందుకే గెలిచారు: జేసీ దివాకర్ రెడ్డి

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu