ఈత సరదా: గల్లంతైన 7వ తరగతి విద్యార్ధి

Published : Mar 16, 2021, 06:29 PM IST
ఈత సరదా: గల్లంతైన 7వ తరగతి విద్యార్ధి

సారాంశం

విజయవాడ రూరల్ నిడమనూరు గ్రామంలో రవేస్ కాలువ లో ఈత కోసం  వెళ్లి 7 వ తరగతి చదువుతున్న విద్యార్థి మంగళవారం నాడు గల్లంతయ్యారు.  


విజయవాడ: విజయవాడ రూరల్ నిడమనూరు గ్రామంలో రవేస్ కాలువ లో ఈత కోసం  వెళ్లి 7 వ తరగతి చదువుతున్న విద్యార్థి మంగళవారం నాడు గల్లంతయ్యారు.గల్లంతైన విద్యార్ధిని  ఎనికెపాడు గ్రామానికి చెందిన కొమిరితేజగా గుర్తించారు.  తేజ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విద్యార్ధి కోసం గాలిస్తున్నారు.

సరదా కోసం ఈత కోసం వెళ్లిన  విద్యార్ధి ప్రమాదవశాత్తు  గల్లంతు కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  ఈత కోసం వెళ్లే వారి విషయంలో  కుటుంబసభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

కాలువల వద్దకు వెళ్లే సమయంలో  పెద్దలు వెంట ఉండాలని పోలీసులు చెబుతున్నారు  వేసవి కాలంలో  కాలువలు, బావులు, ఇతర ప్రాంతాల్లో ఈత కోసం విద్యార్ధులు ఎక్కువగా వెళ్తుంటారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం