ల్యాప్‌టాప్‌ల మాయం కేసు: పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన కోడల శివరాం, బెయిల్

By sivanagaprasad KodatiFirst Published Nov 2, 2019, 4:34 PM IST
Highlights

ఏపీ మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. స్కిల్ డెవలప్‌మెంట్ ల్యాప్‌టాప్ మాయం కేసులో శివరామ్ ఏ1 ముద్ధాయిగా ఉన్నారు. 

ఏపీ మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. స్కిల్ డెవలప్‌మెంట్ ల్యాప్‌టాప్ మాయం కేసులో శివరామ్ ఏ1 ముద్ధాయిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా మాజీ అధికారి అజేశ్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే శివరామ్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు 30 ల్యాప్‌టాప్‌లు, ఒక సోలార్ యూపీఎస్, ఒక ప్రింటర్‌ను 2017లో అజేష్ చౌదరి స్థానిక ఎన్ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌లో భద్రపరిచారు.

Also read:కోడెల శివరాంకు షాక్ : రూ.కోటి జరిమానా

అయితే రోజులు గడుస్తున్నా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ మాత్రం ఏర్పాటు చేయలేదు. కానీ గెస్ట్‌హౌస్‌లో ఉండాల్సిన సామాగ్రి మాయమైనట్లు స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా అధికారి బాజిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రధాని నిందితుడిగా కోడెల శివరాం, రెండో నిందితుడిగా అజేశ్ చౌదరితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. అనంతరం గుంటూరులోని డీఆర్‌డీఏ సెంటర్‌లో 29 ల్యాప్‌టాప్‌లు, బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా కోడెల శివరాం హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అలాగే నరసరావుపేట, సత్తెనపల్లిలో నమోదైన ఐదు కేసుల్లో అరెస్ట్ కాకుండా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ల్యాప్‌టాప్‌ల మాయం కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో శివరాం అరెస్ట్ తప్పదన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు శివరాం శనివారం సత్తెనపల్లి పీఎస్‌లో లొంగిపోయారు. ఇద్దరు జామీనుదారులు, రూ.40 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. 

Also Read:కే ట్యాక్స్ వసూళ్ల పర్వం: కోడెల అనుచరుడు అరెస్ట్, ఇక శివరాం వంతు

ఇకపోతే కోడెల శివరాంకు పీఏగా ఉన్న గుత్తా నాగప్రసాద్ కే ట్యాక్స్ వసూలు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన తనయుడు కోడెల శివరాం కే ట్యాక్స్ వసూలు చేశారని టీడీపీ, వైసీపీలతోపాటు పలువురు వ్యాపారస్తులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. 

కే ట్యాక్స్ వసూలలో కీలక పాత్రధారి గుత్తా నాగప్రసాద్‌ అని ప్రచారం. కోడెల కుటంబానికి అన్నీ తానై గుత్తా నాగ ప్రసాద్ వ్యవహరించారని ఇప్పటకీ ప్రచారంలో ఉంది. సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని పోలీసుల ఫిర్యాదులో కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే.  

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, అతని కుమారుడు శివరామకృష్ణలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్‌ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. శివరాంకు చెందిన కొన్ని ఆస్తులను నాగప్రసాద్ పేరిట రాయించినట్లు కూడా చర్చ జరుగుతుంది. 

click me!