జనసేన లాంగ్ మార్చ్ కి బాబు టీం రెడీ: పవన్ తో అడుగేయనున్న ముగ్గురు మాజీమంత్రులు

By Nagaraju penumala  |  First Published Nov 2, 2019, 4:30 PM IST

తెలుగుదేశం పార్టీ మాత్రమే పవన్ లాంగ్ మార్చ్ కి మద్దతు ప్రకటించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో ముగ్గురు టీడీపీ నేతలు వేదిక పంచుకోనున్నారు. మాజీమంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసులు లాంగ్ మార్చ్ లో పాల్గొంటారని పార్టీ తెలిపింది. 


విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సంక్షోభంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చిన లాంగ్ మార్చ్ కు అన్ని పార్టీలు హ్యాండ్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీ మాత్రం అండగా నిలబడింది. ఏ పార్టీ కలిసొచ్చినా లేకపోయినా తాము అండగా ఉంటామని చూపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 

నవంబర్ 3 ఆదివారం మధ్యాహ్నాం విశాఖపట్నం జిల్లా వేదికగా పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ లో తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంట శ్రీనివాసరావులు పాల్గొంటారని పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నేతలకు ఆదేశాలు సైతం జారీ చేసింది టీడీపీ. 

Latest Videos

ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మద్దెలపాలెం తెలుగు తల్లి విగ్రహం దగ్గర పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల లాంగ్ మార్చ్ నిర్వహించనున్నారు. జీవీఎంసీ కార్యాలయం సమీపంలోని గాంధీ విగ్రహం వరకు లాంగ్ మార్చ్ కొనసాగనుంది.

ఇకపోతే నవంబర్ 3 ఆదివారం మధ్యాహ్నాం 3గంటలకు ప్రారంభం కానున్న లాంగ్ మార్చ్ కు అన్ని పార్టీల మద్దతు కోరారు జనసేనాని పవన్ కళ్యాణ్. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు స్వయంగా ఫోన్ చేశారు.

ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో 30 లక్షల మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచేందుకు తాము నవంబర్ 3న లాంగ్ మార్చ్ చేపట్టనున్నామని అందులో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ కోరారు. 

అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే మద్దతు ప్రకటించార. మిగిలిన పార్టీలు హాజరు కావడం లేదని తెగేసి చెప్పాయి. పవన్ కళ్యాణ్ చేపట్టబోయే లాంగ్ మార్చ్ లో తాము పాల్గొనలేమని స్పష్టం చేశాయి. 

ఈ నేపథ్యంలో శనివారం పవన్ కళ్యాణ్ కు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధులు స్వయంగా లేఖలు రాశారు. లాంగ్ మార్చ్ లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. లాంగ్ మార్చ్ కి తమతోపాటు బీజేపీని కూడా ఆహ్వానించడంతో తాము దూరం కావాల్సి వస్తుందని తెలిపారు. 

ఇకపోతే పవన్ లాంగ్ మార్చ్ ఆహ్వానంపై బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. తొలుత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ వేదికను తాము పంచుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైతం పవన్ తో వేదికను పంచుకోబోమని తెలిపారు. 

అయితే శుక్రవారం కన్నా లక్ష్మీనారాయణ మాట మార్చారు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు బీజేపీ సంఘీభావం తెలుపుతుందని తెలిపారు. అయితే విష్ణువర్థన్ రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. దాంతో బీజేపీ గందరగోళంలో పడింది. 

వాస్తవానికి గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. వామపక్ష పార్టీలకు సైతం కీలక సీట్లు కేటాయించారు. అయితే వారు కూడా పవన్ కళ్యాణ్ పోరాటానికి దూరంగా ఉండటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ఇకపోతే తెలుగుదేశం పార్టీ మాత్రమే పవన్ లాంగ్ మార్చ్ కి మద్దతు ప్రకటించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో ముగ్గురు టీడీపీ నేతలు వేదిక పంచుకోనున్నారు. మాజీమంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసులు లాంగ్ మార్చ్ లో పాల్గొంటారని పార్టీ తెలిపింది. 

అన్ని పార్టీలు తిరస్కరించి కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే మద్దతు ప్రకటించడంతో వైసీపీ నేతలు విమర్శల దాడి పెంచారు. మద్దతుతో మరోసారి టీడీపీ జనసేన ఒక్కటేనని రుజువైందంటూ టీడీపీ నేతలు మాటల దాడికి దిగుతున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ట్రాక్టర్లతో తొక్కించి చంపారు-వనజాక్షిపై దాడి చేశారు: పవన్ పై మంత్రి కన్నబాబు

పవన్ నీది రాంగ్ మార్చ్, బాబుతో స్నేహం చేస్తే భవిష్యత్ కష్టమే: మంత్రి అనిల్

పవన్ లాంగ్ మార్చ్: వైసీపీ ఎత్తులు, ఎలక్షన్ సీన్ రిపీట్

click me!