బిగుస్తున్న ఉచ్చు: అజ్ఞాతంలోకి కోడెల కుమారుడు, కూతురు

Published : Jun 13, 2019, 01:15 PM IST
బిగుస్తున్న ఉచ్చు: అజ్ఞాతంలోకి కోడెల కుమారుడు, కూతురు

సారాంశం

కోడెలతో పాటు  ఆయన కుమారుడు కోడెల శివరామ్‌, విజయలక్ష్మి ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరని అంటున్నారు. వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది.

గుంటూరు: పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు కోడెల శివరాం, కూతురు విజయలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోదంి.  భూకబ్జా, నకిలీ పత్రాల తయారీ, బెదిరింపులు, కులదూషణల వంటి ఆరోపణలను వారు ఎదుర్కుంటున్నారు.

కోడెలతో పాటు  ఆయన కుమారుడు కోడెల శివరామ్‌, విజయలక్ష్మి ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరని అంటున్నారు. వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది. ముందస్తు బెయిల్‌ కోసం వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఓ బాధితుడికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలియడంతో మరికొందరు బాధితులు కోడెల నివాసం, కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  తన కుటుంబంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని కోడెల శివప్రసాదరావు బుధవారం ఆరోపించిన విషయం తెలిసిందే. 

తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ కేసులకు ఆధారాలు చూపించి రుజువు చేయాలని డిమాండ్‌ చేశారు.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!