జగన్ వైఖరితో కంగుతిన్న చంద్రబాబు

By telugu teamFirst Published Jun 13, 2019, 12:02 PM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన పక్షం రోజుల్లోనే చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జగన్ తీసుకునే నిర్ణయాలు... ఆయన వైఖరితో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కంగుతిన్నారు. 

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన పక్షం రోజుల్లోనే చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జగన్ తీసుకునే నిర్ణయాలు... ఆయన వైఖరితో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కంగుతిన్నారు. 

ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాలు జరగగా... ఇక రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. అయితే... ఈ స్పీకర్ ఎన్నికపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అధికార పక్షం నుంచి ఏ సమాచారం రాకపోవడం గమనార్హం.

స్పీకర్ పదవికి అధికార పక్షం నుంచి తమ్మినేని సీతారం బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో టీడీపీ సభ్యులెవరూ వెంటలేకపోవడం విశేషం. గతంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం...ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షం నుంచి స్పీకర్ ఎన్నికపై సమాచారం ఇచ్చేవారు. స్పీకర్ నామినేషన్ పత్రాలపై ప్రతిపక్ష సభ్యులు కూడా సంతకాలు చేసేవారు. అయితే... తమ్మినేని సీతారం విషయంలో మాత్రం అలా జరగకపోవడం విశేషం. ప్రతిపక్షాన్ని పూర్తిగా దూరం చేశారు.

ఇది మాత్రమే కాదు... శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సభలో ప్రమాణ స్వీకారం చేశాక సీఎం ప్రతిపక్ష బల్లల వైపు వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి వెళ్లడం ఆనవాయితీ. పోయినసారి సభలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ వద్దకు వచ్చి కరచాలనం చేసి వెళ్లారు. గతంలో వైఎస్‌ సీఎం అయినప్పుడు కూడా ఇలాగే చంద్రబాబు వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపి వెళ్లారు. ఇప్పుడు జగన్‌ అటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు’ అని టీడీపీ నేతలు  చర్చించుకోవడం విశేషం. 

click me!