మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కొడాలి నాని ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గెండెపోటు కారణంతో ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది..
మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన నానికి చికిత్స జరుగుతోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
అయితే తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయనను ముంబైకి తరలించినట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసమే నానిని ముంబైకి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక విమానంలో కొడాలి నానితో కలిసి ఆయన కుటుంబ సభ్యులు ముంబై బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మొదట నాని జీర్ణ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. గుండెకు సంబంధించి మూడు వాల్వ్స్ పూడుకుపోయినట్లు సమాచారం. కాగా మాజీ సీఎం జగన్.. హైదరాబాద్‌లోని ఆస్పత్రి వైద్యులతో మాట్లాడిన సమయంలో ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయనను ఎయిర్ అంబులెన్స్‌లో ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించారు.