వైఎస్ఆర్ Kadapa Districtలో నేడు Cm Ys Jagan పర్యాటించారు. కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్కులను ప్రారంభించారు. ఈ పార్కును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు సీఎం. ఇండస్ట్రీయల్ హబ్ నిర్మాణం కోసం రూ. 1585 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఈ హబ్‌తో దాదాపు 75 వేల మంది యువతకు.. ఉద్యోగాలు లభిస్తాయని కాగా, ఈ మెగా పారిశ్రామిక హబ్‌లతో రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని సీఎం జగన్ అన్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. తాజాగా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించారు. వైఎస్సార్-జగనన్న ఇండస్ట్రియల్ హబ్, వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ల ప్రారంభించారు. కొప్పర్తి సెజ్‌లో ఇండస్ట్రియల్ పార్క్‌లను 6914 ఎకరాల్లో ఏపీ ప్రభుత్వం అభివృద్ది చేసింది. ఇందులో 3164 ఎకరాల్లో వైఎస్‌ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ పార్క్. 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్. 104 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు అభివృద్ది చేసింది. మెగా ఇండస్ట్రియల్ పార్కు కోసం రూ.1,585 కోట్లు ఖర్చు చేసింది ఏపీ సర్కార్. ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్‌లో కంపెనీలు రూ. 1052 కోట్లు పెట్టుబడులను పెట్టనున్నాయి. తద్వారా దాదాపు 14,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. కొప్పర్తిలో మెగా పారిశ్రామికపార్కు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మెగా ఇండస్ట్రియల్ పార్కులో రూ.600 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు మరో 18 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ప్రకటించారు. మరో 6 నుంచి 9 నెలల్లో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ వివరించారు. ఈ హబ్ ద్వారా 75 వేల మందికి ఉద్యోగావకాశాలు సీఎం జగన్ తెలిపారు. ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఇదే చోట పనిచేస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. త్వరలో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని తెలిపారు.
Read Also; కక్షతోనే నాపై కేసులు: వైసీపీ సర్కార్ పై ఆశోక్ గజపతి రాజు
ఈ పార్కు ప్రారంభానికి ముందు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ 163 కోట్ల వ్యయంతో 5 ప్రధాన మురికి కాల్వలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే.. నూతన మంచినీటి పైప్‌లైన్‌కు రూ.119కోట్లు, కూరగాయల మార్కెట్ కోసం రూ.50.90 కోట్లు, పెన్నానది బ్రిడ్జి నిర్మాణానికి రూ.53కోట్లు, ప్రొద్దుటూర్ ఆస్పత్రిలో మౌలిక సౌకర్యాల ఏర్పాటు చేయడానికి రూ.20.50కోట్లు, ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు రూ.4.5కోట్లు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులో ఇళ్ల స్థలాల కోసం రూ. 200 కోట్లు కేటాయించమని తద్వారా 22, 212 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు.