టిడిపి మాజీ ఎమ్మెల్యే కారును ఢీకొన్న లారీ... కాటంరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

Arun Kumar P   | Asianet News
Published : Oct 18, 2021, 11:25 AM IST
టిడిపి మాజీ ఎమ్మెల్యే కారును ఢీకొన్న లారీ... కాటంరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

సారాంశం

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, కావలి ఇంచార్జీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో కాటంరెడ్డి కారులోనే వున్నా సురక్షితంగా బయటపడ్డారు. 

నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇంచార్జి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అతడు ప్రయాణిస్తున్న కారును వెనకనుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుండి విష్ణువర్ధన్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. 

వీడియో

nellore district కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద విష్ణువర్ధన్ రెడ్డిని లారీ ఢీకొట్టింది. వెనుకవైపు నుండి వేగంగా వచ్చిన లారీ ఒక్కసారిగా కారును గుద్దుకుంటూ వెళ్లిపోయింది. అయితే కారు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారును రోడ్డుకిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న kavali tdp incharge విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మిగతావారు కూడా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.  

VIDEO దుర్గమ్మ దర్శనానికి వెళుతుండగా రోడ్డుప్రమాదం... 10మంది మహిళలకు గాయాలు  

అయితే కారు వెనకబాగం మాత్రం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే kodavaluru పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కారును పరిశీలించి ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించేందుకు ఘటనాస్థలానికి సమీపంలోని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.  

కావలి మాజీ ఎమ్మెల్యే katamreddy vishnuvardhan reddy రోడ్డుప్రమాదం నుండి సురక్షితంగా బయటపడినట్లు తెలిసి టిడిపి శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్