ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కసిరెడ్డి... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Aug 12, 2020, 10:26 AM IST
Highlights

రాష్ట్రంలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను జగన్ ప్రభుత్వం బదిలీ చేసింది. 

అమరావతి: రాష్ట్రంలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను జగన్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా కసిరెడ్డి వీఆర్ఎన్ రెడ్డి నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్సుమెంట్ డీజీ గా కసిరెడ్డి వీఆర్ఎన్ రెడ్డి కి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక విశాఖ పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా ను డీజీపీ ఆఫీస్ కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో విశాఖ సిపిగా మనీష్ కుమార్ సిన్హా నియమించారు. 

ఇదిలావుంటే ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ జగన్ సర్కార్ ఇటీవలే మళ్లీ పొడిగించింది. ఆగస్ట్ 5 వరకూ ఏబీపై ఉన్న సస్పెన్షన్ ను పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీస్ అధికారుల సస్పెన్షన్ రివ్యూ కమిటీ నివేదిక ఆధారంగా ఈ సస్పెన్షన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.   

read more   రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై విచారణ పున:ప్రారంభం...ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో  ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్టుగా  జగన్ ప్రభుత్వం భావిస్తోంది.  ఈ కారణంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే  వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది ప్రభుత్వం. 

చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న కాలంలో ఇంటలిజెన్స్ ఏపీ చీఫ్ గా వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఆ సమయంలో వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంలో ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా పనిచేశారని ఆ సమయంలో  వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసింది.

వైసీపీ ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును పక్కన పెట్టింది. ఎనిమిది మాసాలుగా ఆయనకు ఎక్కడా కూడ పోస్టింగ్ ఇవ్వలేదు. సెక్యూరిటీ పరికరాల కుంభకోణంలో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సస్పెన్షన్ తాజాగా మరింత పొడిగించింది. 

 


 

click me!