మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి హైకోర్టు షాక్

Published : Aug 12, 2020, 08:41 AM ISTUpdated : Aug 12, 2020, 08:50 AM IST
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి హైకోర్టు షాక్

సారాంశం

ప్రాణ హాని లేనప్పుడు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆదినారాయణ రెడ్డి దాఖలు చేసిన రిట్ అప్పీల్ ను ధర్మాసనం కొట్టివేసింది.


మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆది నారాయణ రెడ్డికి ఉన్న 1+1 భద్రతను తొలగించడాన్ని సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. 

ప్రాణ హాని లేనప్పుడు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆదినారాయణ రెడ్డి దాఖలు చేసిన రిట్ అప్పీల్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?