'కాపునాడు' సంఘం నేత పిళ్లా వెంకటేశ్వరరావు కన్నుమూత

By telugu teamFirst Published May 6, 2021, 8:39 AM IST
Highlights

కాపు సంఘం నేత పిల్లా వెంకటేశ్వర రావు తుదిశ్వాస విడిచారు. కరోనాకు విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతికి పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు.

అమరావతి: 'కాపునాడు' సంఘం నేత పిళ్లా వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కరోనా సోకి విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృత్యువాత పడ్డారు. వంగవీటి మోహన రంగాకు పిళ్లా అత్యంత సన్నిహితుడిగా ఆయన పేరు పొందారు. 

రాష్టస్థ్రాయిలో కాపు సమస్యల పరిష్కారం కోసం పిళ్లా పని చేశారు. పిళ్లా వెంకటేశ్వరరావు మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాపుల సంక్షేమానికి విశేష కృషి చేసిన పిళ్లా మృతి తీరనిలోటన్నారు. పిళ్లా కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాష్ట్ర కాపు నాడు సహ వ్యవస్థాపకుడు పిళ్లా వెంకటేశ్వర రావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పవన్ కల్యాణ్ తెలిపారు. వెంకటేశ్వర రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

కాపుల సమస్యలపై ఆయన స్పందించిన విధానాన్ని ఎన్నటికీ మరచిపోలేమన్నారు. కాపుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పిళ్లా పని చేశారని గుర్తు చేశారు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు తన తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పవన్ చెప్పారు.

click me!