తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కేసులు: ఏపీలో కొత్తగా 22,204 మందికి పాజిటివ్, తూ.గోలో అత్యధికం

Siva Kodati |  
Published : May 05, 2021, 08:02 PM IST
తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కేసులు: ఏపీలో కొత్తగా 22,204 మందికి పాజిటివ్, తూ.గోలో అత్యధికం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో దేశంలో కోవిడ్ తీవ్రత అధికంగా వున్న రాష్ట్రాల లిస్ట్‌లోకి ఏపీ వెళ్లిపోయింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,204 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో దేశంలో కోవిడ్ తీవ్రత అధికంగా వున్న రాష్ట్రాల లిస్ట్‌లోకి ఏపీ వెళ్లిపోయింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,204 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 12,06,232కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 85 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8,374కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విశాఖపట్నం 11, విజయనగరం 11, అనంతపురం 10, తూర్పుగోదావరి 9, ప్రకాశం 8, పశ్చిమ గోదావరి 7, చిత్తూరు 6, గుంటూరు 5, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణ 4, శ్రీకాకుళం 3, కడపలలో ఒక్కొరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 11,128 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 10,27,270కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,16,367 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,69,50,299కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,70,588 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 2304, చిత్తూరు 1756, తూర్పుగోదావరి 2344, గుంటూరు 1971, కడప 903, కృష్ణ 1138, కర్నూలు 1985, నెల్లూరు 1200, ప్రకాశం 2001, శ్రీకాకుళం 1982, విశాఖపట్నం 2113, విజయనగరం 1202, పశ్చిమ గోదావరిలలో 1304 మంది చొప్పున వైరస్ సోకింది. 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu