వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు , సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్ధుల మూడో జాబితా విడుదలైంది. 21 మందితో కూడిన వైసీపీ అభ్యర్ధుల జాబితాను తాడేపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు , సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా విడుదలైంది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేసిన అనంతరం 23 మందితో కూడిన వైసీపీ అభ్యర్ధుల జాబితాను తాడేపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు 38 స్థానాల్లో మార్పులు చేశారు జగన్. మొదటి విడతలో 11 స్థానాల్లో, రెండో జాబితాలో 27 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు.
తొలి జాబితాలో ఎంపీ అభ్యర్ధుల పేర్లు ప్రకటించలేదు. కానీ సెకండ్ లిస్ట్‌లో మాత్రం ముగ్గురు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు. తాజా లిస్ట్‌లో నలుగురు సిట్టింగ్ ఎంపీలకు జగన్ మొండి చేయి చూపారు. తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. అలాగే ఈ జాబితాలో 13 మంది కొత్త వారికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాకిచ్చారు.
సంక్రాంతి తర్వాత మరో రెండు లిస్ట్‌లు విడుదల చేయాలని జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో వున్నారు. ఈ నెలాఖరులోగా 175 మంది ఎమ్మెల్యే, 25 మంది ఎంపీ అభ్యర్ధులను ఖరారు చేసి వచ్చే నెల రెండో వారంలో ప్రకటించనున్నారు. అదే వారంలో వైసీపీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు.
ఎంపీ అభ్యర్ధులు :
ఎమ్మెల్యే అభ్యర్ధులు :