కదిరి టీచర్ హత్య ‘పార్థీ గ్యాంగ్’ పనేనా?.. 25 నిమిషాల్లో దొంగతనం, హత్య, దాడితో అనుమానిస్తున్న పోలీసులు...

By AN TeluguFirst Published Nov 17, 2021, 1:32 PM IST
Highlights

సంచలనం రేకెత్తించిన కదిరి ఎన్జీవో కాలనీ ఉషారాణి టీచర్ హత్య కేసును ఛేదించడానికి పోలీస్ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఎస్పి డాక్టర్ ఫక్కీరప్ప 10 నుంచి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

అనంతపురం :  కదిరి ఎన్జీవో కాలనీలో మంగళవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే రెండు ఇళ్లలో చోరీకి తెగబడ్డారు. నగల అపహరణ తో ఆగకుండా  ఉషారాణి (47) అనే టీచర్ ను హతమార్చి.. పక్కింట్లో ఉండే టీ స్టాల్ రమణ భార్య శివమ్మను తీవ్రంగా గాయపరిచారు. అదికూడా జనసంచారం మొదలయ్యే ఉదయం 5.15 నుంచి 5.40 గంటల మధ్య  ఈ దారుణానికి ఒడిగట్టాడం కలకలం రేపింది.

ఈ తరహా దొంగతనాలు జిల్లా,  Inter-district thieves చేసే అవకాశం లేదని, మధ్యప్రదేశ్ కు చెందిన  కరుడుగట్టిన  ‘పార్థీ గ్యాంగ్’ పని అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఇదే కోణంలో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.

రంగంలోకి ప్రత్యేక బృందాలు
సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడానికి Police Department చర్యలు వేగవంతం చేసింది. ఎస్పి డాక్టర్ ఫక్కీరప్ప 10 నుంచి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పటికే ఘటనా స్థలంలో  క్లూస్ టీం,  డాగ్ స్క్వాడ్  సాయంతో  వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. ఈ తరహా కేసుల ఛేదింపులో అనుభవం కలిగిన పోలీసు అధికారులు, సిసిఎస్ కానిస్టేబుళ్లను ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందాలు ఇప్పటికే పని మొదలు పెట్టాయి.

కదిరి సమీపంలోని టోల్గేట్ తో పాటు  రైల్వే స్టేషన్లు,  బస్టాండ్లు,  చెక్ పోస్టులు,  ప్రధాన కూడళ్లలో ని  సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.  ప్రస్తుతానికైతే వాటిలో అనుమానితుల ఆనవాళ్లు లభించలేదని పోలీసులు తెలిపారు.

Biswabhusan Harichandan: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలింపు..

కదిరి ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరైనా వచ్చారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలైన  పులివెందుల, మదనపల్లి, హిందూపురం తదితర ప్రాంతాలకు  బృందాలను పంపి, ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను  పరిశీలించేందుకు చర్యలు చేపట్టారు. Parthy Gang ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నందున  మధ్యప్రదేశ్ కూ  ఓ బృందాన్ని పంపుతున్నట్లు ఎస్పి డాక్టర్ Fakkirappa తెలిపారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా  చేధిస్తామని చెప్పారు.

లాడ్జిల్లో తనిఖీలు..
ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా వచ్చి బస చేశారా? అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు కదిరి పట్టణంలోని lodgesలో విస్తృత తనిఖీలు చేపట్టారు.  సుమారు 15  లాడ్జిల్లో  తనిఖీలు చేయడంతోపాటు CC Tv footageలను కూడా పరిశీలించారు.  అలాగే  పాత నేరస్తులపై  నిఘా వేశారు.

శోకసంద్రంలో చీకిరేవులపల్లి..
దొంగల చేతిలో ప్రభుత్వ టీచర్ ఉషారాణి హత్యకు గురికావడంతో మండలంలోని  చీకిరేవులపల్లి మునిగిపోయింది.  గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి, ఉషారాణి దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు.  శంకర్ రెడ్డి  ఓడి చెరువు మండలం మహమ్మదాబాద్  క్రాఫ్ట్  హైస్కూల్లో  బయోలాజికల్ సైన్స్ టీచర్  కాగా.. usharani ఒడి చెరువు  జడ్పీ హైస్కూల్ లో  ఫిజికల్ సైన్స్ టీచర్ గా  పని చేస్తున్నారు.

వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రణీత్ రెడ్డి  బెంగళూరులో లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుండగా. చిన్న కుమారుడు దీక్షిత్ రెడ్డి విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్నాడు.

ఉషారాణి dead bodyని kadiri నుంచి  Chikirevulapalliకి  తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు  బంధువులు, తోటి ఉపాధ్యాయులు,  చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమె మృతదేహంపై పడి కుమారులు, భర్త రోదించిన తీరు  పలువురిని కలచివేసింది.

ఎంపీపీ గజ్జెల ప్రసాద్ రెడ్డి,  జెడ్పిటిసి సభ్యురాలు  కడ గుట్ట కవితతో పాటు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు హతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు.  అంతకు ముందు కదిరి ప్రభుత్వాస్పత్రిలో ఉషారాణి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

click me!