AP Municipal Elections results 2021: దర్శి మున్సిపాలిటీని కైవసం చేసుకన్న టీడీపీ.. ఎన్ని వార్డుల్లో గెలిచిందంటే

By team telugu  |  First Published Nov 17, 2021, 11:12 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, 12 మున్సిపాలిటీలకు (AP Municipal Elections) సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీని (darsi municipality result 2021) టీడీపీ కైవసం చేసుకుంది.


ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, 12 మున్సిపాలిటీలకు (AP Municipal Elections) సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నవే. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ (TDP) కొన్ని చోట్ల ప్రభావం కనబరుస్తుంది. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీని (darsi municipality result 2021) టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉండగా.. ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం పూర్తయింది. 13 వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. మిగిలిన 7 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. 


నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీకి మొగ్గు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మిగిలిన మున్సిపాలిటీల విషయానికి వస్తే ఇప్పుడు అందరి దృష్టి కుప్పం పైనే ఉంది. కుప్పం మున్సిపాలిటీ (Kuppam municipal result) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఉండటంతో.. టీడీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే చంద్రబాబు కంచుకోటలో జెండా ఎగరవేయాలని అధికార వైసీపీ భావిస్తోంది. 

Latest Videos

undefined

Also read: AP Election Result 2021: మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి..

మరోవైపు దాచేపల్లి మున్సిపాలిటీలో (dachepalli municipal result) టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉండగా.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో టీడీపీ -7 , వైసీపీ-9 వార్డులు గెలుచుకున్నాయి. ఒక స్థానంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు. మరో మూడు వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉంది. 

ఇక, నేడు నెల్లూరు కార్పొరేషన్‌తో, కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డి పాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు కౌంటింగ్ కొనసాగుతుంది. అంతేకాకుండా గ్రేటర్‌ విశాఖలో రెండు డివిజన్‌ స్థానాలకు, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్‌లకు అధికారులు నేడు కౌంటింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!