మామిళ్లపల్లె బ్లాస్ట్ కేసు: క్వారీ లీజుదారుడు నాగేశ్వర్ రెడ్డి సహా ఐదుగురిపై కేసు

By narsimha lodeFirst Published May 10, 2021, 2:19 PM IST
Highlights

కడప జిల్లా మామిళ్లపల్లెలోని క్వారీలో పేలుడు ఘటనపై క్వారీ లీజుదారుడు నాగేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కడప: కడప జిల్లా మామిళ్లపల్లెలోని క్వారీలో పేలుడు ఘటనపై క్వారీ లీజుదారుడు నాగేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం మామిళ్లపల్లెలోని ముగ్గురాయి క్వారీలో పేలుడు  ఘటనలో  సుమారు 10 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం  ఐదు ప్రభుత్వశాఖలతో ఆదివారం నాడు విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఐదు రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. 

also read:మామిళ్లపల్లె క్వారీ పేలుడు: ఐదు శాఖలతో కమిటీ, ఐదు రోజుల్లో నివేదికకు ప్రభుత్వం ఆదేశం

క్వారీలో పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్ హరికిరణ్  ప్రాథమిక నివేదికను  సోమవారం నాడు ప్రభుత్వానికి పంపారు. క్వారీ లీజుదారుడు నాగేశ్వర్ రెడ్డి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తేల్చారు.  ఈ పేలుడుకు కారణమైన నాగేశ్వర్ రెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.కనీస నిబంధనలు పాటించకుండా  క్వారీని నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు  చేసిన కమిటీ కూడ  మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. 

 

click me!