యూటర్న్ గొడవ.. ఆటోడ్రైవర్ ను చితకబాది యువకుడి వీరంగం...

Published : May 10, 2021, 01:48 PM IST
యూటర్న్ గొడవ.. ఆటోడ్రైవర్ ను చితకబాది యువకుడి వీరంగం...

సారాంశం

విజయవాడ ఎంజీ రోడ్డులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. రాఘవయ్య పార్క్ దగ్గర కారులో వచ్చిన యువకుడు ఓ ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. యూ టర్న్ విషయంలో గొడవ పడి, ఆటో డ్రైవర్ పై యువకుడు విచక్షణారహితంగా దాడి చేశాడు.

విజయవాడ ఎంజీ రోడ్డులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. రాఘవయ్య పార్క్ దగ్గర కారులో వచ్చిన యువకుడు ఓ ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. యూ టర్న్ విషయంలో గొడవ పడి, ఆటో డ్రైవర్ పై యువకుడు విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై చిందులు వేశాడు. ట్రాఫిక్ పోలీసులపైన, పాదచారులు పైన దురుసుగా వ్యవహరించాడు. అయితే, ఇంతకీ అతని కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం.

అతను బందరు రోడ్డులో స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో బ్లూ కోల్ట్స్ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. యువకుడి దాడిలో ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. 

యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని ఘటన జరిగిన సమయంలో అక్కడున్న పాదచారులు, వాహన చోదకులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, మరో ఘటనలో ప్రకాశం జిల్లాలో కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజు గట్టు ఎస్సీ కాలనీలో ఆదివారం సాయంత్రం జరిగింది. ప్రమాదంలో బాపూజీ కాలనీకి చెందిన డ్రైవర్ కటికల ప్రవీణ్‌  (30) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని  తీవ్రగాయాలైన ఇద్దరినీ మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటకృష్ణారావు మృతిచెందాడు. స్వల్ప గాయాలైన కోటేశ్వరరావుకు మెరుగైన వైద్యం నిమిత్తం పట్టణంలో ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు.

అయితే, కాలనీ దగ్గర కొత్త బ్రిడ్జి నిర్మిస్తున్న కాంట్రాక్టర్ కాలనీ పక్కన ఉన్న రోడ్డుకు ఇరువైపులా డైవర్షన్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కార్ డ్రైవర్ రాంగ్ రూట్ లో వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో ఇంటి లోపల కటికల మేరీ కుమారి కుమారుడు బయటే కూర్చుని ఉన్నాడు. వారికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇంటి ముందున్న గోడను కారును బలంగా ఢీ కొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది.

PREV
click me!

Recommended Stories

మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu
Huge Job Scam: సీఎంపీషీ పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు దోచుకున్న ముఠా అరెస్ట్ | Asianet News Telugu