కర్నూలు జిల్లా సిరాలదొడ్డిలో విషాదం.. చెరువులో మునిగి ముగ్గురు మృతి..

Published : May 26, 2023, 10:47 AM ISTUpdated : May 26, 2023, 10:50 AM IST
కర్నూలు జిల్లా సిరాలదొడ్డిలో విషాదం.. చెరువులో మునిగి ముగ్గురు మృతి..

సారాంశం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు మృతిచెందారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు మృతిచెందారు. చెరువు గుంతలో పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా సమాచారం. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు ఒక చిన్నారి  ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!