వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైద్రాబాద్ నుండి పులివెందులకు చేరుకున్నారు.
పులివెందుల:కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆదివారంనాడు మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్నారు. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ ఉదయం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి హైద్రాబాద్ నుండి పులివెందులకు బయలుదేరి వెళ్లారు. అరెస్ట్ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై కుటుంబ సభ్యులతో అవినాష్ రెడ్డి చర్చించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ సమయంలో సీబీఐ అధికారులు అందించిన అరెస్ట్ మెమోను అవినాష్ రెడ్డికి తల్లి లక్ష్మి అందించారు.
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయమై పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల నుండి హైద్రాబాద్ కు చేరుకొనే అవకాశం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ తీరును కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తప్పుబట్టారు. గతంలో కూడా వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతుంది.
undefined
also read:ధైర్యంగా ఎదుర్కొంటాం: భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై సీబీఐ, సునీతలపై అవినాష్ రెడ్డి ఫైర్
2019 మార్చి 14న పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ హత్య కేసు విచారణ జాప్యంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింి. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కేసు విచారిస్తున్న అధికారిని కూడా సీబీఐ మార్చింది.