తాడేపల్లికి వైఎస్ అవినాష్ రెడ్డి: జగన్‌తో భేటీ

By narsimha lodeFirst Published Jul 27, 2023, 5:14 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్  తో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు.

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గురువారంనాడుభేటీ అయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఏ-8 వ నిందితుడిగా  సీబీఐ పేర్కొంది. గత నెల 30వ తేదీన  సప్లిమెంటరీ చార్జీషీట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించింది.   2019  మార్చి  14వ తేదీన  వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమై  ఈ ఏడాది ఆగస్టు మాసంలో  విచారణకు  రావాలని  వైఎస్ అవినాష్ రెడ్డికి  సీబీఐ  సమన్లు  జారీ చేసింది.  మరో వైపు ఈ కేసులో  కడప ఎంపీ  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను వివేకానందరెడ్డి కూతురు  వైఎస్ సునీతా రెడ్డి సవాల్ చేశారు.

also read:ఇప్పుడు జగన్‌పై అస్త్రంలా .. 2024 ఎన్నికల తర్వాత సునీతమ్మను పక్కనపెడతారు : సజ్జల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసుకు సంబంధించి  కోర్టుకు సీబీఐ సమర్పించిన  సప్లిమెంటరీ చార్జీషీట్ ను  ఇటీవల కాలంలో మీడియా ప్రసారం చేసింది.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశంలో  సీబీఐ  దర్యాప్తును  వైఎస్ఆర్‌సీపీ తప్పుబట్టింది.  ఈ విషయమై ఆ పార్టీ నేత, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తొలుత సిట్  విచారించింది.  చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో  ఏర్పాటు చేసిన సిట్ విచారించింది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ఏర్పాటు  చేసిన సిట్  విచారించింది.  అయితే  ఈ విషయమై  సీబీఐ విచారణ  నిర్వహించాలని   ఏపీ హైకోర్టు  ఆదేశించింది.  ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో  సీబీఐ  ఈ కేసును విచారిస్తుంది.


 

 

click me!