తిరుపతి మహిళా వర్సిటీలో కేఏ పాల్.. అనుమతి లేకుండా వచ్చి హంగామా..

By Bukka Sumabala  |  First Published Aug 3, 2022, 8:21 AM IST

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంగళవారం తిరుపతి మహిళా యూనివర్సిటిలో పర్యటించారు. అయితే దీనికి యూనివర్సిటీ నుంచి అనుమతులు తీసుకోకపోవడంతో వివాదాస్పదంగా మారింది. 



తిరుపతి : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మంగళవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో హంగామా సృష్టించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో పాల్ కు సంబంధించిన ఐదు వాహనాలు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించాయి. అనుమతి లేకుండా వస్తున్న వాహనాలను సెక్యూరిటీ అడ్డుకుంది. దీంతో తన వాహనాలనే అడ్డుకుంటారా అంటూ కేఏ పాల్ వారిని బెదిరించారు. ఆ తర్వాత నేరుగా  యూనివర్సిటీలోకి వచ్చేశారు. రహదారిపై వాహనాలు ఆపి విద్యార్థినులను  పిలిచి మాట్లాడారు. యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అనుమతి లేకుండా వర్సిటీ లోకి ప్రవేశించిన ఆయన మీద యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు వర్సిటీకి చేరుకుని పాల్ కు చెందిన ఐదు వాహనాలను బయటికి వెళ్లకుండా ఆపేశారు. అనుమతి లేకుండా ఎందుకు ప్రవేశించారు అని ప్రశ్నించారు. కారు దిగి స్టేషన్ కు రావాలని కె ఏ పాల్ ను పోలీసు అధికారులు కోరారు. అయితే, తాను తన కారులోనే స్టేషన్ కు వస్తాను అంటూ తన వాహనంలోని ఉండిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయనను పంపించారు. అనుమతి లేకుండా విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించిన పాల్ మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో కెఏ పాల్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో chandrababu, కెసిఆర్, జగన్ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను విజయం సాధిస్తానని, ఏపీ ముఖ్యమంత్రిగా మహిళను చేస్తానని అన్నారు. 

Latest Videos

undefined

కాకినాడలో కేఏపాల్ కు చేదు అనుభవం: పాల్ కార్లను దాచి పెట్టిన రత్నకుమార్

ఇదిలా ఉండగా, జూలై 31న ఆంధ్రప్రదేశ్ లో కేఏ పాల్ మాట్లాడుతూ.. ఏపీలో త‌న‌కే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉందన్నారు. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్, టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల కంటే తననే ఎక్కువ మంది ప్ర‌జ‌లు ఇష్టపడుతున్నారని, తానే సీఎంగా ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నార‌ని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్, కేసీఆర్ లు క‌లిసి ప్ర‌యాణిస్తే రెండు రాష్ట్రాలు చక్కగా అభివృద్ధి చెందేవ‌ని అన్నారు. కానీ వారిద్ద‌రూ చెరో దారిలో ప‌య‌నిస్తున్నార‌ని తెలిపారు. కలిసి ప్రయాణం చేయడానికి వారిద్దరూ ఒప్పుకోవ‌డం లేద‌ని అన్నారు.

ఇక తెలంగాణలోనూ త‌న‌కు మ‌ద్ద‌తు బాగా పెరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. ‘‘ తెలంగాణలో నా మీద దాడి జరిగిన రోజు నుంచి ఇక్క‌డ పొలిటిక‌ల్ స్ట్ర‌క్చ‌ర్ మారిపోయింది. ఈ ఒక్క ఘ‌ట‌న‌తో నాకు తెలంగాణలో దాదాపు 30 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్లు పెరిగాయి ’’ అని పాల్ అన్నారు. అంతేకాదు.. భారత్ కు శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభం ఎదుర‌వ్వ‌క ముందే ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీని ఆ ప‌ద‌వి నుంచి దించేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇక తెలంగాణలో కూడా  సీఎం కేసీఆర్ ను ఓడించాలని, దీనికోసం అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో తాను పోటీ చేస్తాన‌ని ప్రక‌టించారు. 

click me!