Anakapalli Gas Leak: అనకాపల్లిలో మళ్లీ గ్యాస్‌ లీక్‌.. 50 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత !

By Rajesh KFirst Published Aug 3, 2022, 3:02 AM IST
Highlights

Anakapalli Gas Leak: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్చుతాపురం సెజ్ లో ఒక పరిశ్రమలో విషవాయువు రిలీజ్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.  సెజ్‌లోని బ్రాండిక్స్ ప‌రిశ్ర‌మలో విష వాయువు లీకైన‌ట్టు అధికారులు గుర్తించారు

Anakapalli Gas Leak: :  ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లోని ఒక కంపెనీలో మ‌రోసారి గ్యాస్ లీకేజీ అయ్యింది. మంగ‌ళ‌వారం రాత్రి ఒక్క‌సారిగా విషవాయువు వెలువ‌డటంతో చాలా మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ప‌లువురు మ‌హిళ కార్మికులు వాంతులు, వికారంతో ఇబ్బంది పడ్డారు. కొంత మంది స్పృహ కోల్పోయారు. దీంతో వారిని హుటాహుటినా  ఆసుపత్రికి తరలించారు. ప‌లువురు మ‌హిళ‌లు  ఊపిరాడక ఇబ్బంది ప‌డ్డారు. ఆస్పత్రి వద్ద హృదయవిదారక దృశ్యాలు ద‌ర్శ‌మిస్తున్నాయి. బాధితుల్లో  పులువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్యుతాపురంలోని ఓ కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. బ్రాండిక్స్ ప్రాంగణంలో గ్యాస్ లీక్ జరిగినట్లు అనకాపల్లి ఎస్పీ తెలిపారు. ప్ర‌మాదం స‌మ‌యంలో బి షిఫ్ట్‌లో పని చేసేందుకు ఫ్యాక్టరీకి 4 వేల మంది కార్మికులు వచ్చిన‌ట్టు తెలుస్తోంది. పలువురు మహిళలు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు.  దాదాపు 50 మందిని ఆసుపత్రిలో చేర్చారు. ఆవరణలో తరలింపు పనులు జరుగుతున్నాయి. కంపెనీ ఉద్యోగులు అపస్మారక స్థితిలో ఉన్న మహిళా ఉద్యోగులను అంబులెన్స్‌లో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎపిపిసిబి అధికారులు వచ్చి పరిస్థితిని అంచనా వేయాలని పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆ ఘ‌ట‌న‌ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషవాయువు ఎక్కడ లీక్ అయిందంటే అది క్లాత్ మేకింగ్ కంపెనీ అని చెబుతున్నారు.

గతంలోనూ  గ్యాస్ లీక్ 
 
ఈ ప్రాంతంలో గ్యాస్ లీక్ కావడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం కూడా అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ కావడంతో సుమారు 200 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.
 

click me!