‘నా భార్యను దుకాణం మేనేజర్ నిర్భంధించాడు.. తన దగ్గర లేదంటున్నాడు..’ సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య...

Published : Aug 03, 2022, 06:42 AM IST
‘నా భార్యను దుకాణం మేనేజర్ నిర్భంధించాడు.. తన దగ్గర లేదంటున్నాడు..’ సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య...

సారాంశం

తన భార్యను ఆమె పనిచేసే షాపు మేనేజర్ నిర్భందించాడంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనకాపల్లిలో కలకలం రేపింది. 

అనకాపల్లి : నర్సీపట్నంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.  తన భార్యను తీసుకెళ్లిన వారిని శిక్షించాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. ఆ తరువాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా  నర్సీపట్నం కొత్త వీధికి చెందిన కామిరెడ్డి దుర్గాప్రసాద్ (35) సోమవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. కాగా, మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. 

అంతకుముందు దుర్గాప్రసాద్ తీసుకున్నసెల్ఫీ వీడియోలో ‘ నర్సీపట్నంలోని ఓ వస్త్ర దుకాణం మేనేజర్ నా భార్యను తీసుకుపోయాడు. ఆమె అతని వద్దే ఉన్నా, తెలియదు అంటున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరి కారణంగా నేను చనిపోతున్నాను. దుకాణంలో పని చేస్తున్న యువకుడిని పట్టుకుంటే అంతా బయటకు వస్తుంది.  దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు ఇస్తే.. పట్టించుకోకుండా పక్కన పడేశారు.  ఐదు నెలలుగా తిరుగుతున్నాను. వారిని శిక్షించి న్యాయం చేయండి సార్’ అని విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియోపై సిఐ శ్రీనివాసరావు స్పందిస్తూ దుర్గాప్రసాద్పై అతని భార్య ఫిర్యాదు చేయగా... గతంలో కౌన్సిలింగ్ చేశామని ఆ కోపంతో పోలీసులపై ఆరోపణలు చేసి ఉండవచ్చు అన్నారు.  

దుర్గాప్రసాద్ కు పదేళ్ళ కిందట ఓ యువతితో పెళ్లి అయ్యింది.  కాగా ఆమె అతడిని వదిలేసింది. తర్వాత తల్లిదండ్రులు లేని  మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె  బట్టల దుకాణంలో పని చేసేది. నిరుడు ఏప్రిల్ లో పాడేరులో ఉంటున్న తన సోదరుడు ఇంటికి వెళ్ళిపోయిన ఆమె మళ్ళీ తిరిగి రాలేదు.  తాగుడు అలవాటు.. భార్య వెళ్ళిపోయిందన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని మృతుడి తల్లి సత్యవతి ఫిర్యాదులో పేర్కొన్నారు అని తెలిపారు.

Anakapalli Gas Leak: అనకాపల్లిలో మళ్లీ గ్యాస్‌ లీక్‌.. 50 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత !

ఇదిలా ఉండగా, జూన్ 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ప్రేమజంట పరారీకి సహకరించారంటూ.. ఆ ఊరి సర్పంచ్ ముగ్గురు యువకులను కొట్టాడు. వారిలో ఒక యువకుడు మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో జరిగిన ఈ సంఘటనపై మృతుడి సెల్ఫీ వీడియో, అతడి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం గండిగూడెం గ్రామానికి చెందిన దుర్గ భవాని శంకర్ (19) నారంవారిగూడెంలోని  అమ్మమ్మ,  తాతయ్యల వద్ద ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. 

వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన ఒక ప్రేమ జంట ఈ ఆదివారం గ్రామం నుంచి వెళ్ళిపోయింది. ఆ జంటకు ఐదుగురు యువకులు సహకరించారని గ్రామ సర్పంచి ముదిగొండ వెంకట ముత్యం భావించారు. వారిలో భవాని శంకర్, ముత్యాలరావు, వేముల నాగరాజులను పంచాయతీ కార్యాలయానికి పిలిపించి కొట్టారు. ప్రేమజంట ఆచూకీ చెప్పకుంటే చంపేస్తానని బెదిరించి సాయంత్రం వదిలేశారని చెబుతున్నారు. ఇంటికి వెళ్ళాక భవాని శంకర్ మనస్థాపంతో కలుపు మందు తాగడంతో అతడిని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల తర్వాత పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో ప్రాణాలు విడిచాడు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan On Seediri Appalraju Son Issue | YS Jagan Press Meet | Asianet News Telugu
బాబు పాలనలో గంజాయికి గిట్టుబాటు ధర బాగుంది: YS Jagan | Asianet News Telugu