జగన్ సీఎం కాలేడు, పవన్ సెట్ అవ్వడు : నేనే సీఎం అంటున్న కేఏ పాల్

Published : Jan 11, 2019, 01:25 PM IST
జగన్ సీఎం కాలేడు, పవన్ సెట్ అవ్వడు : నేనే సీఎం అంటున్న కేఏ పాల్

సారాంశం

చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ లేదు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం కాలేడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అసలే ఉండదు. ఖచ్చితంగా నేనే సీఎం అవుతా అందులో ఎలాంటి సందేహం లేదు. నేను సీఎం అయితే చంద్రబాబును నా సలహాదారుగా పెట్టుకుంటా.   

విజయవాడ : చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ లేదు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం కాలేడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అసలే ఉండదు. ఖచ్చితంగా నేనే సీఎం అవుతా అందులో ఎలాంటి సందేహం లేదు. నేను సీఎం అయితే చంద్రబాబును నా సలహాదారుగా పెట్టుకుంటా. 

చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ కాకపోతే ఇంకెవరు ఏపీలో సీఎం అయిపోతారు అని సందేహం వస్తుంది కదూ. ఎవరా ఆ కొత్త వ్యక్తి అంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదూ. ఇంకెవరు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. 

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు సీఎం కాలేరని తాను మాత్రమే అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేఏపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాన సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు సీఎం అయితే ఎవరెవరికి ఏ పోస్టులు ఇవ్వాలో కూడా నిర్ణయించేశారు కేఏ పాల్. 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడును సలహాదారుడిగా పెట్టుకుంటానని ప్రకటించేశారు. 2019లో తాను అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇప్పటికే అనేక సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయని చెప్పుకొచ్చారు. సర్వే నివేదికలను చూసి సీఎం చంద్రబాబు తనను అడ్డుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

ఇకపోతే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సీఎం కాలేడు అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు కలిసి నా సంస్థకు నిధులు రాకుండా నిలిపేశారని ఆరోపించారు. మోదీ, చంద్రబాబు ఇద్దరూ శాశ్వత మిత్రులని చెప్పుకొచ్చారు. మోదీ, చంద్రబాబులతో వైఎస్ జగన్ కూడా కలిశారని తెలిపారు. 

జగన, చంద్రబాబులలో ఎవరికి ఓటు వేసినా మోదీకి వేసినట్లేనని స్పష్టం చేశారు. దేశంలో మోదీకి ఏకైక ప్రత్యామ్నాయం తాను మాత్రమేనని చెప్పుకొచ్చారు. మోదీ రెండోసారి ప్రధాని కావడం అసంభవమన్నారు. 18 పార్టీలతో కూడిన థర్డ్‌ ఫ్రంట్‌కు 300కు పైగా సీట్లు వస్తాయన్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం ఉండదన్నారు. పవన్ కళ్యాణ్ సెట్ అవ్వడంటూ కామెంట్ చేశారు కేఏపాల్. 

 ఈ వార్తలు కూడా చదవండి

ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయావ్, నా సత్తా నీకు తెలియదా..?: జగన్ పై కేఏ పాల్ మండిపాటు

నాకు ప్రాణ హాని..చంద్రబాబుదే బాధ్యత.. కే ఎల్ పాల్

మా పార్టీని గెలిపిస్తే రూ.7కోట్ల కోట్ల రూపాయల నిధులు తెస్తా: కేఏపాల్

 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu