పవన్ ను చంద్రబాబు బతిమిలాడుతున్నాడు: కొడాలి నాని

Published : Jan 11, 2019, 01:03 PM IST
పవన్ ను చంద్రబాబు బతిమిలాడుతున్నాడు: కొడాలి నాని

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ పసలేని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.   

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ పసలేని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 

విజయవాడలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని వైఎస్ జగన్ ఒకసారి అధికారంలోకి వస్తే దించే సాహసం ఎవరూ చేయలేరన్నారు. జగన్ దించే సత్తా ఎవరికీ లేదన్న విషయం బాబుకు కూడా తెలుసునన్నారు. 

దేశంలో చంద్రబాబు నాయుడు లాంటి అవినీతిపరుడు లేడని ఆయన మామ దివంగత సీఎం ఎన్టీఆర్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లు మోదీకి మెుక్కిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ సూట్ కేసులు మోస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడ్డెక్కి చంద్రబాబును తిడుతున్నా కలిసి రావాలంటూ బతిమిలాడుతున్నాడని విమర్శించారు. కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా ఉన్నంత కాలంత తాము అసెంబ్లీలో అడుగు పెట్టబోమని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్