మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య కేసు... ఏపీ హైకోర్టు ఆదేశాలు సరికాదన్న సుప్రీంకోర్టు

By Arun Kumar PFirst Published Apr 12, 2021, 1:36 PM IST
Highlights

మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసులో హైకోర్టు ఆదేశించినట్లు దర్యాప్తు అవసరం లేదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. 

న్యూడిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ ఫోన్ సంభాషణపై హైకోర్టు ఆదేశించినట్లు దర్యాప్తు అవసరం లేదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. పిల్ నిర్వహణపై తప్ప హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది.  

హైకోర్టులో దాఖలైన పిల్ మెరిట్స్ జోలికి తాము వెళ్లట్లేదని... పిల్ మెయింటైనబిలిటీని హైకోర్టు పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది. దర్యాప్తు అంశాన్ని ఏపీ హైకోర్టు మరోసారి పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది.

read more రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య కేసు: విచారణకు రిటైర్డ్ సుప్రీం జడ్జి రవీంద్రన్ నియామకం

జడ్జి రామకృష్ణతో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య జరిపిన ఫోన్‌ సంభాషణపై హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మేజిస్ట్రేట్ తో ఫోన్లో వివాదాస్పదంగా మాట్లాడారని... ఈ సంభాషణలో కుట్ర కోణం ఉందో... లేదో తేల్చాలంటూ విచారణకు హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ రవీంద్రన్ నేత్రుత్వంలో దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  

click me!