గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్: భార్యను కాల్చి చంపి డ్రామా ఆడిన హోంగార్డు

Arun Kumar P   | Asianet News
Published : Apr 12, 2021, 12:05 PM IST
గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్: భార్యను కాల్చి చంపి డ్రామా ఆడిన హోంగార్డు

సారాంశం

సీఎం సెక్యురిటి వింగ్ ఏఎస్పీ తుపాకీ మిస్ ఫైర్ అయినట్లు భావిస్తున్న ఘటనలో ట్విస్ట్ బయటపడింది. కావాలనే హోంగార్డు తన భార్య సూర్యరత్నప్రభను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

విజయవాడ: హోంగార్డు వినోద్ భార్య మృతి కేసులో ట్విస్ట్ బయటపడింది. కావాలనే అతను భార్య సూర్యరత్నప్రభను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతురాలు నాలుగు నెలల గర్భిణీ అని తెలుస్తోంది. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఆ విషయంపై తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు తుపాకి పేలి హోం గార్డు భార్య మరణించినట్లు భావించారు. భార్యకు సరదాగా హోం గార్డు వినోద్ తూపాకి చూపించాడని, ఆ సమయంలో అది మిస్ ఫైర్ అయిందనిస దాంతో హోం గార్డు భార్య సూర్యరత్నప్రభ అక్కడికక్కడే మరణించిందని చెబుతూ వచ్చారు. 

read more  సీఎం సెక్యురిటి వింగ్ ఏఎస్పీ తుపాకీ మిస్ ఫైర్... హోంగార్డు భార్య మృతి

ఈ సంఘటనపై భవానీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోంగార్డు వద్ద పేలిన తుపాకి ఏఎస్పీది. హోంగార్డు, ఎఎఎస్పీ మూడు రోజుల క్రితం అనంతపురం పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఎఎస్పీ తన తుపాకిని హోంగార్డు వద్ద పెట్టాడు. 

అయితే, ఏఎస్పీ తుపాకి హోంగార్డు వినోద్ వద్దనే ఉంది. దాన్ని భార్య సూర్యరత్నప్రభకు వినోద్ సరదా చూపించడం ప్రారంభించాడు. ఆ సమయంలో అది మిస్ ఫైర్ అయింది. సీఎం సెక్యూరిటీ వింగ్ ఎఎస్పీ అసిస్టెంట్ గా వినోద్ పనిచేస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు