తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

Published : Aug 26, 2017, 05:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

సారాంశం

ఉప రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి పేన్ టాఫ్ జీప్ దగ్గర పడ్డ డ్రోన్ 

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శ‌నివారం ఉద‌యం వెంకయ్యకు అమరావతిలో పౌర సన్మానం ఘ‌నంగా జరిగిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి వీరు ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా బయల్దేరారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు డ్రోన్ కెమెరాతో కూడా చిత్రీకరణ జరిపారు.

వీరి ర్యాలీ ని ముందు నుండి షూట్ చేస్తున్న డ్రోన్‌ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వ‌ద్ద‌కు చేరుకుంది. ముగ్గురున్న‌ వ్యాన్ చిత్రికరిస్తున్న డ్రోన్‌ అక్క‌డ‌ పక్కనున్న చెట్టు కొమ్మలో డ్రోన్ చిక్కుకుంది. దీన్ని తప్పించేందుకు ఆపరేటర్లు ప్రయత్నిస్తుండగానే వీరి వాహనం అక్కడకు చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో డ్రోన్ కుప్పకూలింది. ఇది వీరికి అతి సమీపంలోనే పడిపోయింది. ఏ మాత్రం ఆల‌స్యం అయినా వ్యాన్ లో ఉన్న వెంకయ్య‌కు, న‌ర్సింహాన్‌, చంద్ర‌బాబుల పై ప‌డేది, డ్రోన్ వారికి చాలా ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో డ్రోన్ కొంచెం దెబ్బతింది. అప్ప‌టికప్ప‌డే అధికారులు మరో డ్రోన్ ను తెప్పించి, చిత్రీకరణ జరిపారు. 
 

 

మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చెయ్యండి.

వినాయకుడి అలంక‌ర‌ణ కోసం వెళ్లీ తిరిగిరాని లోకాలకు..

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్